Site icon NTV Telugu

Jharkhand: కర్ణి సేన అధ్యక్షుడు వినయ్ సింగ్ అనుమానాస్పద మృతి

Karnisena

Karnisena

జార్ఖండ్ రాష్ట్ర కర్ణి సేన అధ్యక్షుడు వినయ్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. తలలో బుల్లెట్ కనిపించింది. ఇక మృతదేహం పక్కన ఒక పిస్టల్ కనిపించింది. వినయ్ సింగ్ కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్ లోకేషన్ ఆధారంగా జంషెడ్‌పూర్‌లో ఉన్నట్లుగా గుర్తించారు. సంఘటనాస్థలికి వెళ్లగానే వినయ్ సింగ్ మృతదేహం కనిపించింది. తలలో బుల్లెట్ కనిపించింది. ఇక ఒక చేతిలో తుపాకీ కనిపించింది. అయితే ఆయన  తిరిగి ఇంటికి వస్తుండగా కొందరు వ్యక్తులు అడ్డుకుని కాల్చినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. మరింత సమాచారం కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరుగుతోందని జంషెడ్‌పూర్ పోలీసులు పేర్కొన్నారు.

ఇక వినయ్ సింగ్ మరణవార్త తెలుసుకున్న ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. హంతకులను శిక్షించాలంటూ ఆందోళనకు దిగారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి: Rohit Shetty : టాలీవుడ్ నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది..

Exit mobile version