Site icon NTV Telugu

Delhi: ప్రధాని మోడీతో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ భేటీ

Hemantsoren

Hemantsoren

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. గత వారం హస్తిన పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి హేమంత్ పలువురి ప్రముఖులను  కలిశారు. ఇక సోమవారం మధ్యాహ్నం ప్రధాని మోడీని కలిశారు. మర్యాదపూర్వకంగా ఈ సమావేశం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చకు వచ్చినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Deputy CM Pawan Kalyan: నామినేటెడ్ పోస్టులపై పవన్‌ కీలక వ్యాఖ్యలు.. నాగబాబుకు పదవి..!?

హేమంత్ సోరెన్.. తన సతీమణి కల్పనా సోరెన్‌తో కలిసి శనివారం ఢిల్లీకి వచ్చారు. కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీని కలిశారు. అనంతరం అక్కడ నుంచి నేరుగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసానికి చేరుకుని.. ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్‌ను కలిశారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు, ఈడీ, సీబీఐ కేసులపై చర్చకు వచ్చినట్లు వార్తలు వినిపించాయి.

ఇది కూడా చదవండి: Rakshit Shetty FIR: హీరో రక్షిత్ శెట్టిపై ఎఫ్ఐఆర్ నమోదు!

మనీలాండరింగ్ కేసులో జనవరి 31న హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఐదు నెలల తర్వాత బెయిల్ లభించడంతో జైలు నుంచి విడుదలయ్యారు. జైలుకు వెళ్లిన సమయంలో జేఎంఎం పార్టీ సీనియర్ నేత చంపై సోరెన్ ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు. హేమంత్ బెయిల్‌పై ఇంటికి రావడంతో చంపై ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి హేమంత్‌కు మార్గం సుగమం చేశారు. ఇక జూలై 4న మూడోసారి జార్ఖండ్ సీఎంగా హేమంత్ ప్రమాణస్వీకారం చేశారు.

Exit mobile version