NTV Telugu Site icon

Delhi: రాహుల్, ఖర్గేను కలిసిన సీఎం హేమంత్, కల్పన దంపతులు

Kalpanasoren

Kalpanasoren

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, సతీమణి కల్పనా సోరెన్‌తో కలిసి ఢిల్లీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలను కలిశారు. హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాతే భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇండియా కూటమిలో భాగంగా పొత్తులపై చర్చించేందుకు ఈ సమావేశం జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Kerala: బీజేపీలో చేరిన కేరళ తొలి మహిళా ఐపీఎస్ శ్రీలేఖ

ఇదిలా ఉంటే చంపై సోరెన్ ఇటీవల జేఎంఎం పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఈసారి ఇక్కడ గట్టి పోటీ నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ దూకుడుగానే వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు హర్యానాలో కాంగ్రెస్ పొత్తు లేకుండా ఒంటరిగా వెళ్లి చావుదెబ్బతింది. ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇప్పటికే ఇండియా కూటమి మిత్రపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకూడదని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను పిలిచి చర్చలు జరిపినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Traffic Diversion : బతుకమ్మ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు