NTV Telugu Site icon

Bihar: జేడీయూ కార్యకర్తలకు మాంసంతో భోజనం.. కుక్కలు కనిపించడం లేదన్న బీజేపీ

Bihar

Bihar

Bihar: బీహార్ లో జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) నాయకుడు ఏర్పాటు చేసిన పార్టీ వివాదాస్పదం అయింది. జేడీయూ అధ్యక్షుడు లాలన్ సింగ్ తన కార్యకర్తలకు మటన్ రైస్ తో విందు ఏర్పాటు చేశారు. ముంగేర్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బీజేపీ నాయకుడు చేసిన విమర్శలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. జేడీయూ అధ్యక్షుడు విందు ఏర్పాటు చేసిన తర్వాత నుంచి ఆ ప్రాంతంలో వందలాది కుక్కలు కనిపించడం లేదని బీజేపీ ఆరోపించారు.

Read Also: Septic Tank: సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా.. ఊపిరాడక కార్మికుడు మృతి

ఈ విందు కార్యక్రమంలో రద్దీని అదుపు చేయలేక తోపుటాల జరిగింది. పార్టీ కార్యకర్తలు కర్రలతో దాడులు చేసుకున్నారు. జేడీయూ అధ్యక్షుడు లాలన్ సింగ్ మాంసంతో పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేశాడు. అయితే ఆ సమయం నుంచి నగరంలో వందలాది కుక్కలు కనిపించకుండా పోయాయని పలువురు తెలిపారని, వీటి మాంసాన్నే కార్యకర్తలకు తినిపించారని, దీన్ని విచారణ చేయాలని, దీని వల్ల ఏ వ్యాధి వ్యాప్తిస్తుందో అని, మద్యం సేవించారా లేదా..? అన్నది దర్యాప్తు చేయాలని అని బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హా బుధవారం ఆరోపించారు. బీహార్ లో మద్యపాన నిషేధం అమలులో ఉంది. అయితే ఆ విందు కార్యక్రమంలో జేడీయూ నేతలు, కార్యకర్తలు మద్యం సేవించారా..? లేదా..? అనేది విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హా ఆరోపణలపై జేడీయూ పార్టీ ఫైర్ అయింది. విజయ్ కుమార్ సిన్హా ‘‘ మానసికంగా దివాళా తీశారు’’ అని పేర్కొంది. బీజేపీ నేతపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన జేడీ(యూ) అధికార ప్రతినిధి అభిషేక్ ఝా మాట్లాడుతూ.. తన విందులో ప్రజలకు ఏ జంతువు మాంసాన్ని వడ్డిస్తాడో విజయ్ కుమార్ సిన్హా స్వయంగా వెల్లడించాలని అన్నారు.