Site icon NTV Telugu

Karnataka Sex Scandal: సెక్స్ వీడియో కేసులో ముందస్తు బెయిల్ కోసం హెచ్‌డీ రేవణ్ణ పిటిషన్..

Revanna

Revanna

Karnataka Sex Scandal: ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండర్ కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. మహిళల్ని లైంగికంగా వేధించిన కేసులో ప్రజ్వల్‌తో పాటు ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ నిందితులుగా ఉన్నారు. రేవణ్ణ ఇంట్లో పనిచేసే 47 మహిళ వీరిద్దరిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసింది. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన 3000 వీడియోలు ప్రస్తుత ఆ రాష్ట్రంలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా రేవణ్ణ కుటుంబానికి కంచుకోటగా ఉన్న హహస్ జిల్లాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రజ్వల్ బెంగళూర్ నుంచి జర్మనీ లోని ఫ్రాంక్‌ఫర్ట్‌కి వెళ్లిపోయాడు. మరోవైపు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తోంది.

Read Also: Balka Suman : దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నియంత పాలన కొనసాగిస్తుంది

మరోవైపు ఈ కేసు వెలుగులోకి రావడంతో ప్రజ్వల్‌ని జేడీఎస్ నుంచి బహిష్కరించారు. ఇదిలా ఉంటే హెచ్‌డీ రేవణ్ణ ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెంగళూరులోని సెషన్స్ కోర్టులో అప్పీల్ దాఖలు చేయగా, కేసు రేపటికి వాయిదా పడింది. ప్రజ్వల్ మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు. అయితే, ఈ కేసులో తన పేరు, తన తండ్రి పేరును ఎందుకు లాగుతున్నారని, ఇది రేవణ్ణ కుటుంబానికి చెందిన విషయమని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని శిక్షించాలని కోరారు.

విదేశాల్లో ఉన్న ప్రజ్వల్‌ని విచారణ నిమిత్తం తమ ముందు హాజరుకావాలని సిట్ కోరింది. రాష్ట్రప్రభుత్వం అతడిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. జేడీఎస్‌తో పొత్తు పెట్టుకున్న బీజేపీకి ఈ పరిణామం కొంత ఇబ్బందికరంగా మారింది. ఈ విషయంలో బీజేపీ రాష్ట్ర నాయకులు దూరంగా ఉంటున్నారు. ఈ సెక్స్ స్కాండల్‌పై తొలిసారిగా ప్రజ్వల్ స్పందిస్తూ.. నిజాలు త్వరలోనే తెలుస్తాయని చెప్పారు.

Exit mobile version