Javed Akhtar: బీహార్‌లో ఒక కార్యక్రమంలో ఆయుష్ వైద్యులకు నియామక పత్రాలను అందిస్తూ, సీఎం నితీష్ కుమార్ ఒక ముస్లిం యువతి ‘‘హిజాబ్’’ను లాగడం వివాదాస్పదం అయింది. దీనిపై రాజకీయ రచ్చ మొదలైంది. ప్రముఖ లిరిసిస్ట్ జావేద్ అక్తర్ కూడా ఈ వివాదంపై సీఎం నితీష్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాను ‘‘పనిచేసే చోట పరదా అనే సాంప్రదాయ భావనకు వ్యతిరేకిని. అయినప్పటికీ, బీహార్ సీఎం ఆ మహిళకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి’’ అని అన్నారు. తాను హిజాబ్‌కు వ్యతిరేకం, కానీ ఒక ముస్లిం మహిళ డాక్టర్‌కు జరిగిన దానిని మాత్రం నేను అంగీకరించలేదనని, ఈ ఘటనను ఖండిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు.
Read Also: Vikarabad: 8 నెలల క్రితం లవ్ మ్యారేజ్.. ప్రేమ పెళ్లి ఇష్టం లేకపోవడంతో..
ఒక కార్యక్రమంలో ఆయుష్ వైద్యులకు నియామక పత్రాలు అందజేస్తున్నప్పుడు ఒక మహిళ హిజాబ్‌ను లాగివేయడంతో సీఎం నితీష్ కుమార్ వివాదంలో చిక్కుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నియామక పత్రాన్ని అందిస్తూ, నితీష్ కుమార్ మహిళ హిజాబ్ తీసేయాలని చెబుతూ, దానిని లాగడం కనిపిస్తుంది. హిజాబ్ ధరించిన యువతి నుస్రత్ పర్వీన్ తన నియామక పత్రాన్ని తీసుకోవడానికి వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం, ఈ వివాదంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
