Site icon NTV Telugu

Bihar elections 2025: ప్రశాంత్ కిషోర్‌కు ఝలక్.. ఓటింగ్‌కు ఒక రోజు ముందు బీజేపీలోకి జన్‌సురాజ్ అభ్యర్థి..

Pk

Pk

Bihar elections 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ కు ఒక రోజు ముందు జన్ సురాజ్ పార్టీ అభ్యర్థి బీజేపీలో చేరారు. గురువారం బీహార్‌లో మొదటి విడుత ఓటింగ్ జరబోతోంది. దీనికి ఒక్క రోజు ముందే ప్రశాంత్ కిషోర్‌కు ఆయన పార్టీ అభ్యర్థి ఝలక్ ఇచ్చారు. ముంగేర్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తు సంజయ్ సింగ్ బుధవారం బీజేపీలో చేరారు. ముంగేర్ బీజేపీ అభ్యర్థి కుమార్ ప్రణయ్ సమక్షంలో బీజేపీ సభ్యత్వాన్ని తీసుకుని, ఎన్డీయే కూటమికి మద్దతు ఇచ్చారు.

Read Also: Rajnath Singh: సైన్యానికి కుల మతాలు లేవు.. రాహుల్‌గాంధీపై రక్షణ మంత్రి ఆగ్రహం..

ఈ అసెంబ్లీ నుంచి త్రిముఖ పోరు ఉంటుందని అంతా భావించినప్పటికీ, మళ్లీ బీజేపీ వర్సెస్ ఆర్జేడీగా మారింది. బీజేపీలో చేరిన తర్వాత సంజయ్ సింగ్ మీడియాలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలో బీహార్ కొత్త శిఖరాలకు చేరుకుంటుందని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. జన్ సురాజ్ పార్టీ గురించి మాట్లాడుతూ.. పార్టీ ఆలోచన మంచిదని, ప్రజలకు లాభాన్ని చేకూర్చేదని కానీ, దృఢమైన, బలమైన నాయకత్వం అవసరమని, అందుకే బీజేపీలో చేరినట్లు చెప్పారు.

ఎన్నికల ముందు ప్రశాంత్ కిషోర్‌కు వరస ఎదురుదెబ్బలు తాకుతున్నాయి. ఆయన పార్టీ జన్ సురాజ్ తరుపున పోటీలో ఉన్న వారు క్రమంగా పోటీ నుంచి తప్పుకుంటున్నారు. అక్టోబర్ ప్రారంభంలో ముగ్గురు జన్ సురాజ్ అభ్యర్థులు తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహకరించుకున్నారు. వీరు ముగ్గురు దానాపూర్, బ్రహ్మపూర్, గోపాల్ గంజ్ నియోజకవర్గాల నుంచి పోటీ నుంచి బయటకు వచ్చారు. తమ అభ్యర్థుల్ని అడ్డుకునేందుకు బీజేపీ బల ప్రయోగం చేస్తోందని జన్ సురాజ్ ఆరోపిస్తోంది. గురువారం 18 జిల్లాల్లోని 121 స్థానాలకు ఓటింగ్ జరుగబోతోంది. 243 అసెంబ్లీ సీట్లు ఉన్న బీహార్ లో రెండో దశ పోలింగ్ నవంబర్ 11న, ఫలితాలు నవంబర్ 14న వెలువడనున్నాయి.

Exit mobile version