Site icon NTV Telugu

Udhampur Blast: అమిత్ షా పర్యటన లక్ష్యంగా ఉదంపూర్ జంట పేలుళ్లు: జమ్మూ కాశ్మీర్ పోలీసులు

Jammu Kashmir Police

Jammu Kashmir Police

Udhampur Blast : సెప్టెంబర్ 28, 29 తేదీల్లో ఎనిమిది గంటల వ్యవధిలో జమ్మూ కాశ్మీర్ లోని ఉదంపూర్ లో ఆగి ఉన్న రెండు బస్సుల్లో పేలుళ్లు జరిగాయి. అమిత్ షా పర్యటన నేపథ్యంలోనే ఉగ్రవాదాలు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్ వెల్లడించారు. పోలీసులు, ఇతర ఏజెన్సీల సహాయంతో వివిధ కోణాల్లో ఉగ్రకోణాన్ని దర్యాప్తు చేశామని.. ఈ ఘటనలో మహ్మద్ అమీన్ భట్ అనే నిందితుడి ప్రమేయం ఉన్నట్లుగా కాశ్మీర్ పోలీసులు తెలిపారు.

పేలుళ్ల మాస్టర్ మైండ్ అమీన్ భట్ ప్రస్తుతం పాకిస్తాన్ లో స్థిరపడినట్లు డీజీపీ వెల్లడించారు. సోషల్ మీడియా యాప్‌ల ద్వారా అస్లాం సీక్ అనే మరో ఉగ్రవాదితో నిత్యం సంప్రదింపులు జరిపే వాడని.. డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ నుంచి స్టిక్కీ బాంబులు, నాలుగు ఐఈడీలు అందించినట్లు జమ్మూ ఏడీజీపీ ముఖేష్ సింగ్ తెలిపారు. సెప్టెంబర్ 27న అమిత్ షా పర్యటన నేపథ్యంలో పర్యటనకు ముందు అనువైన ప్రదేశాల్లో బాంబులు అమర్చాలని అమీన్ భట్, అస్లాం సీక్ కు ఆదేశాలు ఇచ్చాడని.. దీంతో రెండు బస్సుల్లో రెండు ఐఈడీలను అమర్చినట్లు పోలీసులు గుర్తించారు.

Read Also: Prabhas: అఫీషియల్.. రావణ దహనానికి హాజరుకానున్న ప్రభాస్

ఉధంపూర్ జిల్లాలో బుధవారం రాత్రి ఆగి పున్న బస్సులో పేలుడు సంభవించి ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. గురువారం ఇదే విధంగా మరో బస్సులో పేలుడు జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు రోజుల పర్యటన ముందు ఈ ఉగ్రఘటనలు చోటు చేసుకున్నాయి. గత 6నెలలుగా జమ్మూలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రారంభించేందుకు పలు ఉగ్రసంస్థలు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసులు మరో 5 ఐడీలను, రెండు మాడ్యూళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు మాడ్యూళ్లలో ఒకటి లష్కరే తోయిబా, మరొకటి జైషే మహ్మద్ ఉగ్రసంస్థలకు చెందినదిగా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో నిందితుడు అస్లాం సీక్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అంతకుముందు ప్రధాని మోదీ పర్యటనకు ముందు ఇద్దరు జైషే ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఈసారి లష్కరే తోయిబా మాడ్యూల్ ను పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

 

 

 

Exit mobile version