Site icon NTV Telugu

Jammu Kashmir: కాశ్మీర్ లోయలో ఎన్ కౌంటర్.. ఇద్దరు లష్కరే ఉగ్రవాదుల హతం

Jammu Kashmir Encounter

Jammu Kashmir Encounter

Two terrorists killed in Shopian encounter in jammu kashmir: జమ్మూకాశ్మీర్ లో భద్రతాబలగాలు మరోసారి పైచేయి సాధించాయి. ఉగ్రవాదులను మట్టుపెట్టాయి. జమ్మూ కాశ్మీర్ లో గత కొంత కాలంగా ఉగ్రవాదులు ఏదైనా దాడికి పాల్పడాలని ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో పలువురు స్థానికులు, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. కానీ ఎప్పటికప్పుడు ఉగ్రవాదుల ప్లాన్స్ ను భగ్నం చేస్తున్నాయి భద్రతా బలగాలు. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి భద్రతా బలగాలు.

తాజాగా దక్షిణ కాశ్మీర్ లోని షోఫియాన్ జిల్లాలోని నాగ్ బాల్ ప్రాంతంలో మంగళవారం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. నిషేధిత లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాబలగాలు హతమార్చాయి. నాగ్ బాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు అక్కడ కార్డర్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను మట్టుపెట్టాయి భద్రతాబలగాలు.

Read Also: Babri Masjid Demolition Case: బాబ్రీ కేసులో అన్ని ధిక్కార పిటిషన్లను క్లోజ్ చేసిన సుప్రీంకోర్టు

ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలు తీసుకుంటున్న చర్యలతో ఉగ్రవాదులు తగ్గుముఖం పట్టాయి. అయితే స్థానికేతరులు, సాధారణ పౌరులు లక్ష్యంగా చేసుకుంటూ టార్గెటెడ్ కిల్లింగ్స్ కు పాల్పడుతున్నారు. కాశ్మీర్ పండిట్లు, హిందువులు, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న ది రెసిస్టెంట్ ఫ్రంట్ హైబ్రీడ్ దాడులకు పాల్పడుతోంది. గతంలో కాశ్మీరీ పండిట్ రాహుల్ భట్ హత్యతో పాటు టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్, హిందూ మహిళా ఉపాధ్యాయురాలిని, స్థానికేతరుడైన బ్యాంక్ మేనేజర్ తో పాటు బీహార్ నుంచి వచ్చిన వలస కూలీలను కాల్చి చంపారు. అయితే ఈ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను కొన్ని రోజుల వ్యవధిలోనే భద్రతా బలగాలు మట్టుపెట్టాయి.

Exit mobile version