Site icon NTV Telugu

Jammu Kashmir : జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా?

Jammu Kashmir Special Statu

Jammu Kashmir Special Statu

Jammu Kashmir : ఢిల్లీ – జమ్మూ కశ్మీర్ కు మళ్ళీ ప్రత్యేక రాష్ట్ర హోదా రానుందా.. ఆరేళ్ల తర్వాత తెరపైకి ఎందుకు స్పెషల్ స్టేటస్ పై ఈ చర్చ మొదలైందో తెలుసా.. ఆగస్టు 5 , 2019 న జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదాను కోల్పోయింది.. ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేసింది కేంద్రం.. అంతేకాదు జమ్మూ కాశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసింది..

జమ్ము కాశ్మీర్ ప్రత్యేక రాష్ట్ర హోదాను కోల్పోయి సరిగ్గా ఆరేళ్లు.. అయితే గతేడాదే జమ్ము కాశ్మీర్లో ఎన్నికల నిర్వహించింది ఈ సి.. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో కలిసి పోటీ చేసి అధికారాన్ని దక్కించుకున్నాయి.. ఒమర్ అబ్దుల్లా మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే అబ్దుల్లా ప్రత్యేక రాష్ట్ర హోదా కావాలనే అంశంపై డిమాండ్ చేయడం మొదలుపెట్టారు.. 2023 డిసెంబర్లో సుప్రీంకోర్టు సైతం జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక రాష్ట్ర హోదా రద్దు పై కీలకతీర్పునిచ్చింది.. ఆర్టికల్ 370 రద్దును సుప్రీంకోర్టు సమర్ధించింది. అయితే వీలైనంత త్వరగా జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు.. ఇప్పటివరకు అటువంటి ప్రయత్నాలు ఏమి కనిపించలేదు..

కానీ 370 ఆర్టికల్ రద్దయిన ఆగస్టు 5 రావడానికి రెండు రోజుల ముందు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తో భారత ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లు వేర్వేరుగా సమావేశమయ్యారు.. ఎన్నో కీలక అంశాలపై చర్చించారు.. అయితే సమావేశంలోని చర్చలపై అధికారికంగా ఎటువంటి ప్రకటన లేకపోయినప్పటికీ, 5 ఆగస్ట్ దగ్గర కావడంతో , జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చర్చ మొదలైంది.

Uttam Kumar Reddy : ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లే కాళేశ్వరంపై కమిషన్‌ వేశాం

Exit mobile version