NTV Telugu Site icon

Jammu Kashmir: కాశ్మీర్ లో మరో ఎన్ కౌంటర్.. లష్కర్ ఉగ్రవాది హతం

Jammu Kashmir Encounter

Jammu Kashmir Encounter

Lashkar Terrorist Killed In Encounter In Jammu And Kashmir: జమ్మూ కాశ్మీర్ లో కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న ఉగ్రవాదులు మరోసారి పెట్రేగే ప్రణాళికల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. దీంతో కాశ్మీర్ లో వరసగా ఎన్‌కౌంటర్‌లో జరుగుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ రెండు ఎన్‌కౌంటర్లు కూడా కాశ్మీర్ బారాముల్లా జిల్లాలోనే చోటు చేసుకున్నాయి. శనివారం సాయంత్రం బారాముల్లాలోని బిన్నెర్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ ప్రారంభం అయింది. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన కాశ్మీర్ పోలీసులు, సీఆర్ఫీఎఫ్ బలగాలు జాయింట్ గా ఈ ఎన్ కౌంటర్ ను నిర్వహించాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో లో లష్కరే తోయిబా ఉగ్రవాది ఒకరు హతమయ్యాడని పోలీసులు వెల్లడించారు. భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ ప్రారంభిస్తున్న సమయంలో ఉగ్రవాదులు ఇది గమనించి కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. హతమైన ఉగ్రవాదిని బారాముల్లా జిల్లా పట్టాన్ కు చెందిన ఇర్షాద్ అహ్మద్ భట్ గా గుర్తించారు. ఇతడు మే, 2022 నుంచి ఉగ్రవాద కార్యకలాపాల్లో యాక్టివ్ గా ఉన్నాడు. ఘటనాస్థలం నుంచి ఒక ఏకే రైఫిల్ తో పాటు 2 మ్యాగజైన్స్, స్వాధీనం చేసుకున్నారు.

Read Also: CM Stalin: ఒక దేశం-ఒకే భాష నినాదంపై తమిళనాడు సీఎం సీరియస్

అంతకుముందు శనివారం ఉదయం బారాముల్లా జిల్లాలోని వనిగామ్ గ్రామంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఒక ఉగ్రవాది మరణించగా.. ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో స్నిఫర్ డాగ్ ఆలెక్స్ కూడా మరణించింది. ఎన్‌కౌంటర్‌ జరుగుతున్న సమయంలో బాడీ కామ్ ధరించిన రెండు స్నిఫర్ డాగ్ లను లోపలికి పంపారు. ఈ క్రమంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఒక స్నిపర్ డాగ్ మరణించింది. వనిగామ్ గ్రామంలో ఒక పాకిస్తాన్ ఉగ్రవాదితో పాటు ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో పోలీసులు, ఆర్మీ జాయింట్ ఆపరేషన్ ప్రారంభించాయి.