NTV Telugu Site icon

Jammu Kashmir: కాశ్మీర్ పై పాక్ జాతీయ అసెంబ్లీ తీర్మానాన్ని వ్యతిరేఖించిన ఇండియా

India Pakistan

India Pakistan

పీకల్లోతు ఆర్థిక సమస్యలు, అంతర్గత, రాజకీయ సమస్యలతో సతమతం అవుతున్న పాకిస్తాన్ మరోసారి తన బుద్ధిని బయటపెట్టింది. జమ్మూ కాశ్మీర్ లో నియోజవర్గాల డీలిమిటేషన్ పై వ్యతిరేఖంగా పాక్ జాతీయ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేఖించింది ఇండియా. భారత దేశంలో భాగం అయిన జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ కు వ్యతిరేఖంగా పాక్ చేసిన తీర్మానాన్ని హస్య తీర్మాణంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. పాక్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ తో పాటు భారత భూభాగాలతో సహా భారత దేశ అంతర్గత విషయాల్ల జోక్యం చేసుకోవడానికి పాకిస్తాన్ కు అర్హత లేదని గట్టిగా చెప్పింది. కేంద్ర పాలిత ప్రాంతం అయిన జమ్మూ కాశ్మీర్ పై అనేక సంప్రదింపులు జరిపిన తర్వాత డీలిమిటేషన్ చేస్తున్నామని విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ అన్నారు. కొత్తగా డీలిమిటేషన్ తరువాత కాశ్మీర్ లో బారాముల్లా, శ్రీనగర్, అనంత్ నాగ్ -రాజౌరీ, ఉదంపూర్ , జమ్మూలు ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలుగా ఏర్పడనున్నాయి.

కాగా అంతకుముందు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్( ఓఐసీ) వ్యాఖ్యలను కూడా భారత్ తీవ్రంగా వ్యతిరేఖించింది. ఒక దేశం ఆదేశాలతో మతపరమైన ఎజెండాను అమలు చేయవద్దని ఓఐసీని కోరింది. జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ వ్యవహారంపై భారత్ ను వ్యతిరేఖిస్తూ… ఐఓసీ చేసిన వ్యాఖ్యలు భారత్ తీవ్రంగా ఖండించింది. భారత అంతర్గత వ్యవహారాలపై ఓఐసీ మరోసారి అనవసర వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని హితవు పలికింది భారత విదేశాంగ శాఖ.

భారతదేశంలోని అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంపై ఓఐసీ సెక్రటేరియట్ చేసిన వాదనలను భారత ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల సరిహద్దులను తిరిగి గీయడానికి భారత దేశం చేస్తున్న ప్రయత్నాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని.. ఇది కాశ్మీరీ ప్రజల హక్కులను ఉల్లంఘించడమేనని ఆరోపించింది ఓఐసీ. ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా మండిపడింది. జమ్మూకాశ్మీర్, లఢఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమే అని భారత ప్రభుత్వం పేర్కొంది. పాక్ జాతీయ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని వ్యతిరేఖించిది ఇండియా.