Site icon NTV Telugu

Jammu Kashmir: కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు హిజ్బుల్ ఉగ్రవాదుల హతం

Jammu Kashmir Encounter

Jammu Kashmir Encounter

2 Hizbul Terrorists Killed In Encounter in jammu kashmir: జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులపై భద్రతా బలగాలు పైచేయి సాధించాయి. మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్ లో ఇద్దరు కీలక ఉగ్రవాదులను హతమార్చాయి భద్రతా బలగాలు. అనంత్ నాగ్ జిల్లాలోని పోష్కేరీలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్ లో ఇద్దరు హిజ్బుల్ ముజాహీద్దీన్ ఉగ్రవాదులు హతమయ్యారని కాశ్మీర్ పోలీసులు వెల్డించారు. పోష్కేరీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న తరుణంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.

హతమైన ఉగ్రవాదులను డానిష్ భట్ అలియాస్ కోకబ్ దూరీ, బషరత్ నబీగా పోలీసులు గుర్తించారు. ఇద్దరూ హిజ్బుల్ ముజాహీద్దీన్ ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్నారు. ఇద్దరూ ఎప్రిల్ 9, 2021లో సలీమ్ అనే సైనికుడిని హతమార్చారు. ఈ కేసులో వీరిద్దరు నిందితులుగా ఉన్నారు. దీంతో పాటు మే 29,2021లో జబ్లీపురాలో ఇద్దరు పౌరులను చంపారని.. కాశ్మీర్ జోన్ డీజీపీ విజయ్ కుమార్ ట్వీట్ చేశారు.

Read Also: Solar Storm Hits Earth: సౌర తుఫాన్ భూమిని తాకితే ఎలా ఉంటుందో తెలుసా..? స్టన్నింగ్ వీడియో షేర్ చేసిన ఐఎస్ఎస్

ఆర్టికల్ 370, 35ఏ రద్దైన తర్వాత నుంచి కాశ్మీర్ లో ఉగ్రవాదుల కార్యకలాపాలను తుడిచిపెట్టే ప్రయత్నాలు ప్రారంభించాయి భద్రతా బలగాలు. ఇందులో భాగంగానే అప్పటి నుంచి వరసగా ఉగ్రవాదుల ఏరివేత ప్రారంభం అయింది. అయితే లష్కరే తోయిబాతో పాటు హిజ్బుల్ ముజాహీద్దీన్ ఉగ్రవాద సంస్థలు క్రియాశీలకంగా ఉన్నాయి. లష్కరేకి అనుబంధంగా ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసి స్థానికేతరులు, పండిట్లు, హిందువులను టార్గెట్ చేసుకుని హత్యలు చేస్తున్నారు. గతంలో కాశ్మీరీ పండిట్ రాహుల్ భట్, టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ తో పాటు రాజస్థాన్ కు చెందిన బ్యాంక్ మేనేజర్, మహిళా ఉపాధ్యాయురాలిని, స్థానికేతరులైన ప్రజలను కాల్చి చంపారు. అయితే ఈ ఘటనలకు పాల్పడిన వారిని భద్రతా బలగాలు వేటాడి వెంటాడి చంపాయి. అయితే కాశ్మీర్ లో ఏదో ఒక చర్యకు పాల్పడాలని ఉగ్రవాద సంస్థలు భావిస్తున్నాయి. అయితే భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు వీరి ప్రయత్నాలను భగ్నం చేస్తున్నాయి.

Exit mobile version