Site icon NTV Telugu

PM Modi: జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..

Pm Modi

Pm Modi

PM Modi: జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాపై ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఉదంపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని శుక్రవారం హామీ ఇచ్చారు. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు మరెంతో దూరంలో లేవని, రాష్ట్రహోదా పొందుతుందని, మీరు మీ కలలను మీ ఎమ్మెల్యేలు, మంత్రులతో పంచుకోగలుగుతారని అన్నారు.

Read Also: BRS: కడియంకు చెక్‌ పెట్టేందుకేనా?.. వరంగల్‌ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య!

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదం, దాడులు, రాళ్ల దాడులు, సరిహద్దుల కాల్పులు వంటి భయాలు లేకుండా వచ్చే లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ‘‘దయచేసి నన్ను నమ్మంది. గత 60 ఏళ్లుగా జమ్మూకాశ్మీర్‌లో ఉన్న సమస్యల నుంచి మీరు విముక్తి పొందుతారు. గత 10 ఏళ్లలో జమ్మూ కాశ్మీర్ పూర్తిగా రూపాంతం చెందిందని, నేను నా వాగ్దానాన్ని నెరవేర్చాను’’ అని ఆయన అన్నారు. కాశ్మీర్ ప్రజలు దీర్ఘకాలిక బాధలకు ముగింపు పలుకుతానన్ తన వాగ్దానాన్ని నెరవేర్చానని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు భావిస్తున్నాయని ఆరోపించారు.

ఉదంపూర్ నుంచి జీతేంద్ర సింగ్, జమ్మూ నుంచి జుగల్ కిషోర్‌లకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రధాని మోడీ కోరారు. ‘‘అధికారం కోసం వారు జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 గోడని నిర్మించారు. మీ ఆశీర్వాదంతో మోడీ ఆ గోడల్ని కూల్చివేసి, ఆర్టికల్ 370 చెత్తను భూమిలో పాతిపెట్టారు’’ అని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.

Exit mobile version