NTV Telugu Site icon

S Jaishankar: ‘‘రాహుల్ గాంధీవి ఉద్దేశపూర్వక అబద్ధాలు’’.. “ట్రంప్ ప్రమాణస్వీకారం” వ్యాఖ్యలపై జైశంకర్ రిప్లై..

S Jaishankar

S Jaishankar

S Jaishankar: లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపణలు సంచలనంగా మారాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి ప్రధాని మోడీని ఆహ్వానించేందుకు, జైశంకర్ అమెరికా పర్యటనకు వెళ్లారని ఆరోపించారు. ఈ వ్యవహారం సభలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర వాగ్వాదానికి కారణమైంది.

Read Also: Bathua Leaves Benefits: ఈ ఆకు గురించి మీకు తెలుసా..? ఎంత మేలు చేస్తుందో తెలిస్తే వదిలిపెట్టరు

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. ‘‘ డిసెంబర్ 2024లో నా అమెరికా పర్యటన గురించి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగా అబద్ధం చెప్పారు. నేను బైడెన్ అడ్మినిస్ట్రేషన్ యొక్క విదేశాంగ కార్యదర్శి, NSAని కలవడానికి వెళ్ళాను. మా కాన్సుల్స్ జనరల్ సమావేశానికి కూడా అధ్యక్షత వహించడానికి వెళ్ళాను. ట్రంప్ హయాంలో కాబోయే ఎన్ఎస్ఏగా నియమితులయ్యే అధికారి నన్ను కలిశారు. ఏ దశలోనూ ప్రధానమంత్రి ఆహ్వానం గురించి చర్చించలేదు. మన ప్రధాని ఇలాంటి కార్యక్రమాలకు హాజరుకారని అందరికీ తెలుసు. నిజానికి భారత్ దేశం సాధారణంగా ప్రత్యేక రాయబారులచే ప్రాతినిధ్యం వహిస్తుంది. రాహుల్ గాంధీ అబద్ధాలు రాజకీయంగా ఉద్దేశించిబడి ఉండొచ్చు. కానీ అవి విదేశాల్లో దేశాన్ని దెబ్బతీస్తాయి.’’ అని అన్నారు.

అంతకుముందు లోక్‌సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆహ్వానం పొందడానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ని అమెరికాకు పంపాల్సి అసవరం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఎగతాళి చేస్తూ, ఆర్థిక విధానాలను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. “మేము అమెరికాతో మాట్లాడినప్పుడు, మా ప్రధానమంత్రి ఆహ్వానం కోసం విదేశాంగ మంత్రిని మూడు-నాలుగు సార్లు పంపము ఎందుకంటే మాకు పొడక్షన్ సిస్టమ్ ఉండి, మనం ఈ సాంకేతిక పరిజ్ఞానాలపై పని చేస్తుంటే, అమెరికా అధ్యక్షుడు ఇక్కడికి వచ్చి ప్రధానమంత్రిని ఆహ్వానిస్తారు” అని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.