Site icon NTV Telugu

Jaishankar: ఢాకాలో జైశంకర్ పర్యటన.. పాకిస్థాన్ స్పీకర్‌తో భేటీ

Jaishankar

Jaishankar

భారత విదేశాంగ మంత్రి జైశంకర్ బంగ్లాదేశ్‌లో పర్యటించారు. మాజీ ప్రధాని ఖలీదా జియా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బుధవారం ఢాకా వెళ్లారు. నాలుగు గంటల పాటు బంగ్లాదేశ్‌లో పర్యటించారు. పర్యటనలో భాగంగా పలువురిని కలిశారు.

ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహమాన్‌ను కలిసి జైశంకర్ ఓదార్చారు. ఈ సందర్భంగా భారతదేశంతో ఖలీదా జియా వ్యవహరించిన తీరును గుర్తు చేశారు. ప్రజాస్వామ్యానికి జియా చేసిన సహకారాన్ని జ్ఞాపకం చేశారు. ప్రధాని మోడీ పంపించిన సంతాప లేఖను అందజేశారు.

ఇక పర్యటనలో భాగంగా పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ సర్దార్ అయాజ్ సాదిక్‌ను కూడా కలిశారు. కొద్దిసేపు ఇద్దరూ సమావేశం అయ్యారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ నేతలను ఇలా కలవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఇరువురు శుభాకాంక్షలు చెప్పుకున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Bihar: హిజాబ్ వివాదం.. విధుల్లో చేరని వైద్యురాలు.. అధికారులు ఏం చేయబోతున్నారంటే..!

ఖలీదా జియా బంగ్లాదేశ్‌కు మూడు సార్లు ప్రధానమంత్రిగా పని చేశారు. బీఎన్‌పీ అధినేత్రిగా ఉన్నారు. తీవ్ర అనారోగ్యంగా 80 ఏళ్ల వయసులో డిసెంబర్ 30, 2025న మరణించారు. బుధవారం లక్షలాది మంది జనాల మధ్య ఖలీదా జియా అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇదిలా ఉంటే ఇటీవలే ఖలీదా జియా పెద్ద కుమారుడు తారిఖ్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత లండన్ నుంచి ఢాకాకు వచ్చారు. ఫిబ్రవరి 12న జరగనున్న ఎన్నికల్లో ప్రధానమంత్రి పదవికి పోటీపడుతున్నారు. రాబోయే ఎన్నికల తర్వాత భారతదేశం-బంగ్లాదేశ్ సంబంధాలు మరింతగా మెరుగుపడతాయని జైశంకర్ ఆశావాదం వ్యక్తం చేశారు.

Exit mobile version