Jaishankar: రష్యా చమురుపై భారత్‌కు ఫిన్లాండ్ మద్దతు.. జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- రష్యా ఆయిల్ కొనుగోలుకు ఖర్చు, లభ్యత ఆధారం..
- మరోసారి స్పష్టం చేసిన జైశంకర్..
- రష్యన్ ఆయిల్ కొనుగోలుకు ఫిన్లాండ్ మద్దతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaishankar: రష్యా చమురు కొనుగోలుపై వెస్ట్రన్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలకు మరోసారి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. భారత్ రాజకీయ కారణాలతో కాకుండా, అవసరాలు, మార్కెట్ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. చమురు ఖర్చులు, లభ్యత ఆధారంగా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఫిన్లాండ్లో కుల్తరాంతా టాక్స్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2022లో రష్యాపై ఆంక్షలు విధించిన తర్వాత ప్రపంచ ఇంధన మార్కెట్లో మార్పులు చోటుచేసుకున్నాయని, యూరప్ దేశాలు మిడిల్ ఈస్ట్ నుంచి భారీగా కొనుగోలు చేయడంతో భారత్ ప్రత్యామ్నాయంగా రష్యా చమురును వైపు వెళ్లాల్సి వచ్చిందని జైశంకర్ చెప్పారు.
భారత వాదనకు ఫిన్లాండ్ నుంచి మద్దతు లభించింది. ఫిన్లాండ్ విదేశాంగ మంత్రి ఎలినా వాల్టోనెస్ భారత్‌కు మద్దతుగా నిలిచారు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత వెస్ట్రన్ దేశాలు అమలు చేసిన చమురు ధర పరిమితి నిబంధనలకు లోబడే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు. చమురు ధర పరిమితి విధించడం వెనక ఉద్దేశం ప్రపంచ దేశాలు రష్యా చమురును పూర్తిగా కొనకుండా ఆపడం కాదని, చమురు సరఫరా కొనసాగుతూనే రష్యాకు అధిక లాభాలు రాకుండా చూడటమే లక్ష్యమని ఆమె చెప్పారు.
Also Read
ఇదే సమయంలో, రష్యా ఆయిల్ కొనుగోలు చేయమని అమెరికానే చెప్పిందని జైశంకర్ అన్నారు. ప్రపంచ ఇంధన మార్కెట్లో చోటుచేసుకున్న మార్పుల కారణంగా భారత్ తన ఇంధన వనరుల్ని విస్తరిస్తోందని జైశంకర్ తెలిపారు. ప్రస్తుతం మా అతిపెద్ద చమురు సరఫరా దారు రష్యా, సహజ వాయువు సరఫరాలో అమెరికా మొదటి స్థానంలో ఉందని, ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఈ స్థానంలో ఖతార్ ఉండేదని ఆయన వెల్లడించారు. గల్ఫ్ దేశాలతో భారత్ సంబంధాలు కేవలం చమురు వరకే పరిమితం కావని, అవి వ్యూహాత్మకంగా కూడా ఎంతో కీలకమని ఆయన వివరించారు.
తాజావార్తలు
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
-
Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు