NTV Telugu Site icon

Jairam Ramesh: మణిపూర్ సందర్శించేందుకు ప్రధానికి తీరిక దొరకడం లేదా..?

Jai Ram Ramesh

Jai Ram Ramesh

Jairam Ramesh: ఏడాది కాలంగా మణిపూర్ సమస్య చెలరేగుతోంది. కుకీ, మైయిటీ కమ్యూనిటీల మధ్య జరిగిన జాతి ఘర్షణలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో గతంతో పోలిస్తే పరిస్థితి కొంతమేర ప్రశాంతంగానే ఉంది. ఇదిలా ఉంటే మరోవైపు కాంగ్రెస్ మణిపూర్ సమస్యను మరోసారి లేవనెత్తింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రధాని నరేంద్రమోడీ ఫైర్ అయ్యారు. ఆ ప్రాంత ప్రజల్ని మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. అన్నింటికి ప్రధాని మోడీకి సమయం ఉంటుంది కానీ మణిపూర్ సందర్శించేందుకు ప్రధానికి తీరిక దొరకడం లేదని విమర్శించారు.

Read Also: Team India Prize Money: టీమిండియాకు గుడ్‌న్యూస్‌.. రూ.125 కోట్ల నగదు బహుమతి

మణిపూర్‌లో గతేడాది ఇదే సమయానికి మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ రాజీనామాపై పెద్ద డ్రామా జరిగిందని, అప్పటి నుంచి అక్కడి ప్రజల వేదన కేంద్రానికి పట్టడం లేదని దుయ్యబట్టారు. అనేక కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ప్రధానికి సమయం దొరికిందనిన, కానీ నిత్యం సమస్యలను ఎదుర్కొంటున్న మణిపూర్ సందర్శించేందుకు తీరిక లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని, కనీసం ఆ సమస్య పరిష్కారానికి ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యేందుకు సిద్ధంగా లేరని ఎక్స్ వేదికగా ఆరోపించారు.

గతేడాది మే నెలలో మణిపూర్‌లో కుకీ, మైయిటీ తెగల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎస్టీ హోదా ఇచ్చే అంశాన్ని కుకీలు వ్యతిరేకించడంతో ఇరు వర్గాల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. 225 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లారు.