NTV Telugu Site icon

Rajasthan: జూనియర్ ఎంబీబీఎస్ స్టూడెంట్‌‌పై ర్యాగింగ్.. 300 గుంజీలు తీయించడంతో..!

Raene

Raene

ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా విద్యార్థుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఆయా కాలేజీల్లో ఇప్పటికే ర్యాంగింగ్‌లు జరుగుతూనే ఉన్నాయి. సీనియర్లు.. జూనియర్లను వేధించడం పరిపాటిగా మారిపోతున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో ర్యాంగింగ్‌ భూతం కారణంగా ఒక విద్యార్థి జీవితం ప్రమాదంలో పడింది.

ఇది కూడా చదవండి: Tamannah: వివాదంలో తమన్నా.. 7వ తరగతి విద్యార్థులకి పాఠంగా జీవిత చరిత్ర?

గత నెలలో రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్‌లోని ఒక మెడికల్ కాలేజీలో కొంతమంది సీనియర్ విద్యార్థులు.. జూనియర్ విద్యార్థిపై ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. దీంతో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థికి నాలుగు సార్లు డయాలసిస్ చేయవలసి వచ్చింది. సెకండియర్ చదువుతున్న ఏడుగురు విద్యార్థులు.. జూనియర్‌ను 300 కంటే ఎక్కువగా గుంజీలు తీయించడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అంతేకాకుండా అతని కిడ్నీపై తీవ్ర ప్రభావం పడింది.

ఇది కూడా చదవండి: Kenya: మిలటరీ ఆధీనంలో కెన్యా.. 13కు చేరిన మృతుల సంఖ్య

సమాచారం అందుకున్న పోలీసులు.. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. గుంజీలు కారణంగా విద్యార్థి కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌కు గురైందని పోలీసులు తెలిపారు. బాధితుడు వారం పాటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఈ వారంలోనే నాలుగు సార్లు డయాలసిస్ చేయించుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉందని.. కాలేజీకి కూడా వెళ్తున్నట్లు వెల్లడించారు. ఏడుగురు విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇదిలా ఉంటే బాధితుడు గతంలోనే ర్యాగింగ్ ఎదుర్కొన్న ఫిర్యాదు చేయలేదని.. తాజా ఘటనతో వెలుగులోకి వచ్చిందని పోలీసులు చెప్పారు. ఏడుగురు విద్యార్థులపై IPC సెక్షన్లు 323, 143, 147 (అల్లర్లు), 149 (సాధారణ వస్తువును ప్రాసిక్యూట్ చేయడంలో నేరం), 341 (తప్పు నిర్బంధం), 352 (దాడి) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఇది కూడా చదవండి: Asaduddin Owaisi: అసదుద్దీన్‌ ఒవైసీపై అనర్హత వేటు వేయాలి.. రాష్ట్రపతికి న్యాయవాది లేఖ