NTV Telugu Site icon

Puri Jagannath Rath Yatra: జగన్నాథుడి “రథయాత్ర” ప్రారంభం.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు..

Puri Jagannath Rath Yatra

Puri Jagannath Rath Yatra

Puri Jagannath Rath Yatra: ఒడిశా పూరీలోని జగన్నాథుడి రథయాత్ర మంగళవారం ప్రారంభమైంది. వేలాదిగా భక్తులు పూరీకి చేరుకున్నారు. పూరీ క్షేత్రం మొత్తం ఆధ్యాత్మికంగా మారింది. ఒడిశా ప్రభుత్వం ఈ కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు చేసింది. ఈ రోజు ఉదయం జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల విగ్రహాలను రథాలపై ప్రతిష్టించిన తర్వాత మంగళహారతి చేపట్టారు. మధ్యాహ్నం ఒంటిగంటలక పూరీ రాజు గజపతి దివ్యసింగ్ దేవ్ రథాలపై చెరాపహర( బంగారు చీపురుతో ఊడ్చడం) చేస్తారు. 3 గంటలకు భక్తుల రథాలను లాగుతారు. సాయంత్రం రథాలు గుండిచా మందిరానికి చేరుకునేల ఏర్పాట్లు చేశారు.

Read Also: Baby Care Tip: పిల్లలు ఎప్పుడూ యాక్టివ్ గా ఉండాలంటే ఏం చెయ్యాలో తెలుసా?

రథయాత్ర ప్రారంభం కావడంతో భక్తులందరికీ ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. జగన్నాథుడు ప్రజల జీవితాల్లో ఆరోగ్యం, ఆనందం నిపాలని కోరుకున్నారు. ఢిల్లీలోని హౌజ్ ఖాస్‌లోని జగన్నాథ మందిరంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రార్థనలు చేశారు. మంగళవారం ఉదయం పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతిని కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ కలిశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా రథయాత్ర సందర్భంగా భక్తులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రథయాత్ర పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, శ్రేయస్సు తీసుకురావాలని కోరారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రథయాత్రకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

పెద్ద సంఖ్యలో భక్తులు పూరీకి తరలివస్తుండటంతో ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. 180 ప్లాట్లూన్ల బలగాలను మోహరించారు. బీచ్ పెట్రోలింగ్ కోసం కోస్ట్ గార్డు హెలికాప్టర్ తో పహారా కాస్తున్నారు. రథయాత్ర సందర్భంగా పూరీకి దేశంలోని పలు ప్రాంతాల నుంచి 125 ప్రత్యేక రైళ్లను ప్రారంభించారు.