Mahua Moitra: మహువా మోయిత్రా వివాదంపై తొలిసారి స్పందించిన దీదీ.. ఆమెకే ప్లస్ అంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahua Moitra: పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు లంచం, గిఫ్టులు తీసుకున్నారనే అభియోగాలను ఎదుర్కొంటున్నారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా. వ్యాపారవేత్త హీరానందాని నుంచి డబ్బులు తీసుకున్నారని ఆమెపై ఆరోపణలను పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ విచారించింది. దీంతో పాటు ఆమె పార్లమెంట్ లాగిన్ వివరాలను ఇతరులకు ఇచ్చారని తేలింది. ఈ నేపథ్యంలో ఆమెను ఎంపీ పదవిపై అనర్హత వేటు వేయాలని ప్యానెల్ సిఫారసు చేసింది.
ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై మొదటి నుంచి టీఎంసీ పార్టీ సైలెంట్‌గా ఉంటోంది. తొలిసారి మహువా మోయిత్రా వివాదంపై తృణమూల్ చీఫ్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. లోక్‌సభ నుంచి మహువా మోయిత్రాను బహిష్కరిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆమె గెలుపు అవకాశలు పెరుగుతాయని అన్నారు. లోక్‌సభ నుంచి మోయిత్రాను తప్పించేందుకు ప్లాన్ ప్రకారమే ఇలా చేశారని ఆమె ఆరోపించారు. గురువారం కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read
Read Also: Geert Wilders: “ప్రవక్త” వ్యాఖ్యలపై నుపూర్ శర్మకు మద్దతు ఇచ్చిన డచ్ లీడర్ భారీ విజయం..!
మహువా మోయిత్రా ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేసేందుకు అదానీ గ్రూపుపై ఉద్దేశపూర్వకంగా పార్లమెంట్లో ప్రశ్నలు అడిగారని, ఆమె అడిగిన 60 ప్రశ్నల్లో 51 ప్రశ్నలు అదానీ వ్యవహారం చుట్టే తిరిగాయని, ఇందుకు ఆమె దర్శన్ హీరానందానీ నుంచి రూ.2 కోట్ల నగదుతో పాటు లంచం తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం మహువా మోయిత్రా బెంగాల్‌లోని కృష్ణానగర్ ఎంపీగా ఉన్నారు.
ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మొదట లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. ఆమె లాగిన్ వివారాలపై ఎంక్వైరీ చేయాల్సింది కేంద్రం ఐటీ శాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్‌కి కూడా లేఖ రాశారు. ఈ కేసులో వ్యాపారి దర్శన్ హీరానందానీ ఎథిక్స్ ప్యానెల్‌కి అఫిడవిట్ సమర్పించారు. మోయిత్రాకు డబ్బులు ఇచ్చినట్లు అందులో పేర్కొన్నాడు. అయితే ఆమె మాత్రం ఈ ఆరోపణల్ని ఖండించారు.
తాజావార్తలు
-
Shubman Gill: గిల్ ‘మాస్టర్ ప్లాన్’కి ఓకే చెప్పిన బీసీసీఐ.. శ్రీలంక సిరీస్‌కు ముందే అనూహ్య నిర్ణయం..
-
Priyanka Gandhi: గోమూత్ర వ్యాఖ్యలపై అభ్యంతరం.. ప్రియాంకాగాంధీకి విద్యావేత్తల లేఖ
-
Google Pixel 11 సిరీస్‌లో కొత్త ట్విస్ట్.. లాంచ్‌కు కీలక ఫీచర్స్ లీక్..!
-
Delhi: నిరసనకారులపై కేసులు కొట్టేసిన ఢిల్లీ ప్రభుత్వం.. ఒక్క షరతు!
-
Telangana Govt: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. బకాయిల సొమ్ము రూ.6 వేల కొట్లు విడుదల..
ట్రెండింగ్
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!