IT to Auto-driver: ఐటీ ఉద్యోగం వదిలి ఆటోడ్రైవర్‌గా మారి.. ఒక మహిళ కథ వైరల్..
- ఐటీ మేనేజర్ ఉద్యోగానికి గుడ్‌బై
- ఆటో డ్రైవర్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించిన మహిళ
- నెలకు రూ.60 వేల వరకు ఆదాయం
- ఒత్తిడి లేని జీవితం కోసమే నిర్ణయం
- సోషల్ మీడియాలో వైరల్‌గా ఒక మహిళ కథ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT to Auto-driver: ఐటీ ఉద్యోగం, సాఫ్ట్వేర్ జాబ్ అంటే సమాజంలో ఒక గౌరవం. ఇది ఎంతలా పెరిగిందంటే అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగి అయితేనే పెళ్లి కోసం పిల్లను ఇస్తామనే దాకా వెళ్లింది. ఐటీ ఉద్యోగికి కోట్ల రూపాయల కట్నం ఇచ్చి పెళ్లిళ్లు చేసేవారు. లక్షల్లో సంపాదన, కార్లు, ఇళ్లు ఇలా ఉండేది ఐటీ ఉద్యోగి వైభోగం. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఐటీ జాబ్ అంటే ఒత్తిడి, డబ్బులు వస్తున్న ప్రశాంతత లేని జీవితం, నిత్యం టార్గెట్లతో పోరాటం, ఇక ఏఐ వచ్చిన తర్వాత ఐటీ జాబ్‌లు ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది.
ఇలాంటి పరిస్థితుల్లో, ఐటీ మేనేజర్ నుంచి ఆటో డ్రైవర్‌గా మారిన ఒక మహిళ కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె తీసుకున్న నిర్ణయంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ప్రశాంతమైన జీవితం కోసమే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసిన ఆటో నడపడం ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు. మహిళ స్టోరీని వ్యాపారవేత్త డాక్టర్ నెజ్రిన్ మిధ్లాజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో ఆమెతో మాట కలపగా అసలు నిజం తెలిసింది. ఆటో డ్రైవర్లు అంటే మగవాళ్లే అని అనుకునే స్థితితో, ఒక మహిళ ఆటో డ్రైవర్‌గా ఎలా మారిందనే విషయం తెలుసుకోవాలకున్న సందర్భంలో ఆమె తన ఐటీ ఉద్యోగం, తన జీవిత ప్రయాణాన్ని వివరించింది.
Also Read
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
తాను దాదాపుగా 9 ఏళ్ల పాటు ఐటీ జాబ్ చేశానని, అయితే ఉద్యోగంలో ఒత్తిడి, టెన్షన్‌తో విసిగిపోయి ఆ ఉద్యోగాన్ని వదిలేసినట్లు మహిళ చెప్పారు. ఆ తర్వాత సొంతగా ఆటో కొనుగోలు చేసి నడపడం ప్రారంభించినట్లు వెల్లడించారు. తాను ఆటో నడపడం వల్ల ప్రతీ నెల రూ. 60 వేలు సంపాదిస్తున్నానని, దీనికన్నా ముఖ్యంగా మానసిక ప్రశాంతత, సంతోషం లభిస్తున్నాయని చెప్పింది. సంపాదనతో పాటు నచ్చిన జీవితం గడుపుతున్నట్లు చెప్పొకొచ్చారు. చాలా మంది నెటిజన్లు ఆమె నిర్ణయాన్ని అభినందించారు. హోదా, డబ్బు, ప్రతిష్ట కన్నా మనశ్శాంతి చాలా ముఖ్యమని కామెంట్స్ చేస్తున్నారు. పలువురు ఐటీ ఇండస్ట్రీలో కష్టాలను గురించి చెప్పుకున్నారు.
తాజావార్తలు
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!