NTV Telugu Site icon

chandrayaan-3: చందమామపై ప్రజ్ఞాన్ రోవర్ ఎలా తిరుగుతుందో చూడండి.. ఇస్రో లేటెస్ట్ వీడియో..

Chandrayaan 3

Chandrayaan 3

chandrayaan-3: చంద్రయాన్-3 విజయంతో భారత్ జోష్ మీద ఉంది. చంద్రుడిపై ల్యాండర్, రోవర్ ని ల్యాండ్ చేసిన నాలుగో దేశంగా, దక్షిణ ధృవంపై దిగిన తొలి దేశంగా భారత్ నిలిచింది. అంతకుముందు చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్ అయిన అమెరికా, రష్యా, చైనా తర్వాత భారత్ నిలిచింది. ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ తమ పరిశోధనలను మొదలుపెట్టాయి.

రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ అక్కడ నమూనాలను విశ్లేషిస్తోంది. ఇటీవల రోవర్ ప్రజ్ఞాన్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. ఇటీవల పెద్ద బిలం అడ్డు రావడంతో బెంగళూర్ లోని కమాండ్ సెంటర్ నుంచి రిమోట్ సందేశంతో రోవర్ తన మార్గాన్ని మార్చుకుంది. చంద్రుడి ఉపరితలంపై ఉన్న పెద్ద బిలాలను, రాళ్లను, దిబ్బలను తప్పించుకుంటూ తన యాత్రను కొనసాగిస్తోంది.

Read Also: Karimnagar: రాఖీ కట్టేందుకు 8 కి.మీ నడక.. కాళ్లకు చెప్పులేకుండా తమ్ముడి ఇంటికి అక్క

తాజాగా రోవర్ ప్రజ్ఞాన్ తన దిశను మార్చుకుంటున్న లేటెస్ట్ వీడియోను ఇస్రో ఎక్స్(ట్విట్టర్) ద్వారా షేర్ చేసింది. ‘ చందమామ పెరట్లో చిన్నపిల్ల ఉల్లాసంగా ఆడుతుంటే తల్లి ఆప్యాయంగా చూస్తున్నట్లు ఉంది కదా?’ అంటూ ఇస్రో రాసుకొచ్చింది. ఈ వీడియోలో రోవర్ తన మార్గాన్ని మార్చుకుంటున్నట్లు కనిపిస్తుంది. ల్యాండర్, రోవర్ మొత్తం 14 రోజలు పాటు తమ పరిశోధనలను కొనసాగించనున్నాయి.

ఇప్పటికే చంద్రుడిపై ఆక్సీజన్ ఉందనే విషయాన్ని చంద్రయాన్-3 ప్రయోగం వెలుగులోకి తెచ్చింది. రోవర్ లోని లేజర్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ ద్వారా చంద్రుడి దక్షిణ ధృవంపై సల్ఫర్ ఉంనదని నిర్థారించింది. అల్యూమినియం, కాల్షియం, ఇనుము, క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్ మొదలగు మూలకాల ఉనికిని పనిగట్టింది. హీలియం3 కోసం రోవర్ అణ్వేషిస్తోంది.