Site icon NTV Telugu

ISRO: చంద్ర కక్ష్య నుంచి భూకక్ష్యలోకి ప్రొపల్షన్ మాడ్యూల్‌.. అరుదైన ప్రయోగంలో విజయం సాధించాం.. ఇస్రో

Untitled 9

Untitled 9

Chandrayaan-3: భరత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగం చంద్రయాన్-3. చంద్రుని దక్షణ ధ్రువం పైన ల్యాండ్ అయ్యి ప్రపంచంలో ఏ దేశం సాధించలేని ఘనత సాధించింది. కాగా చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిన తాజా సమాచారాన్ని X వేదికగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ ప్రకటించింది. చంద్రయాన్-3 కి సంబంధించిన తాజా అప్‌డేట్ ను X లో ట్వీటీ చేసింది. ఆ ట్వీట్ లో ప్రొపల్షన్ మాడ్యూల్‌ కక్ష్యను విజయవంతంగా మార్చమని.. చంద్రుడి కక్ష్య లో ఉన్న మాడ్యూల్‌ ను భూకక్ష్యలోకి తీసుకొచ్చి.. అరుదైన ఈ ప్రయోగంలో విజయవంతమయ్యామని తెలిపింది.

Read also:Cyclone Michuang: ఆత్మకూరు బస్టాండ్‌లో మోటార్లు పెట్టి నీటిని తోడుతున్న అధికారులు!

ఇందుకు గాను ఒక కక్ష్య పెంపు విన్యాసం, ఒక ట్రాన్స్-ఎర్త్ ఉత్తేజిత ప్రక్రియ వినియోగించినట్టు తెలిపింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ని అంతరిక్షంలో ప్రవేశ పెట్టేందుకు ఈ ఏడాది జులై 14వ తేదీన శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి రాకెట్ ను ప్రయోగించారు. కాగా ఆగస్టు 23న విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయ్యింది. అనంతరం ప్రజ్ఞాన్ రోవర్‌ చంద్రుడిపై తిరుగాడుతూ అక్కడి పరిస్థితులపై ప్రయోగాలు చేపట్టింది. అలానే ఎంతో విలువైన సమాచారాన్ని ఇస్రో శాస్త్రవేత్తలకు అందించింది. కాగా చంద్రుని పైన 14 రోజులపాటు ఎంతో విలువైన సమాచారాన్ని సేకరించి శాస్త్రవేత్తలకు అందించిన ప్రజ్ఞాన్ రోవర్‌ ఆపైన చంద్రుడిపైన ఏర్పడిన చీకటి కారణంగా నిద్రావస్థలోకి వెళ్ళింది. ఆ తరువాత ప్రజ్ఞాన్ రోవర్‌ను మేల్కొలిపేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించినా ఫలితం దక్కలేదన్న విషయం తెలిసిందే.

Exit mobile version