NTV Telugu Site icon

ISRO somanath: ఐఐటీ మద్రాస్ నుంచి పీహెచ్‌‌డీ పట్టా అందుకున్న ఇస్రో చైర్మన్

Somanath

Somanath

ఇస్రో చైర్మన్ సోమనాథ్ మద్రాస్ ఐఐటీ నుంచి పీహెచ్‌డీ పట్టాను అందుకున్నారు. శుక్రవారం ఐఐటి-మద్రాస్ 61వ స్నాతకోత్సవం జరిగింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ.. ఇస్రో చైర్మన్‌కు పట్టాను ప్రధానం చేసింది. ఒక పలెటూరి అబ్బాయి కల నెరవేరిందని సోమనాథ్ పేర్కొన్నారు.

సోమనాథ్.. కొల్లాంలోని తంగల్ కుంజు ముసలియార్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఐఐఎస్‌సీ బెంగళూరు నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందారు. చారిత్రాత్మక చంద్రయాన్-3 మిషన్‌లోని విక్రమ్ ల్యాండర్ గత ఏడాది ఆగస్టు 23న చంద్రుని ఉపరితలంపై తాకినప్పుడు అతని పేరు మార్మోగింది. శుక్రవారం ఐఐటి-మద్రాస్ 61వ కాన్వకేషన్‌ జరిగింది. ఈ సందర్భంగా పీహెచ్‌డీ పట్టాను ఆయన అందుకున్నారు. దీంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

సోమనాథ్.. ఇప్పటికే ఆయన డజను పీహెచ్‌డీలను అందుకున్నారు. ఆయన విశ్వవిద్యాలయాలు పీహెచ్‌డీలు ప్రధానం చేశాయి. ఇక చంద్రయాన్-3 సక్సెస్ తర్వాత పీహెచ్‌డీ అందుకోవడం సంతోషంగా ఉందని సోమనాథ్ తెలిపారు. ఐఐటీ-మద్రాస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నుంచి పట్టా తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఒక పల్లెటూరి కుర్రాడిగా.. తాను టాపర్ అయినప్పటికీ ఐఐటీ ఎంట్రెన్స్ టెస్ట్ రాసే ధైర్యం చేయలేదన్నారు. ఇక్కడ నుంచి గ్రాడ్యుయేట్ కావాలనుకున్నాను కానీ.. ఇప్పుడు పీహెచ్‌డీ పట్టా పొందుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఇప్పుడు ఐఐటీ-మద్రాస్ నుంచి పీహెచ్‌డీ పట్టాలు లభించాయని వెల్లడించారు.