NTV Telugu Site icon

SpaDeX mission: మరో ఘనత సాధించిన ఇస్రో.. డీ-డాకింగ్ వీడియో వైరల్..

Spadex Mission

Spadex Mission

SpaDeX mission: భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) మరో ఘనత సాధించింది. స్పాడెక్స్ ఉపగ్రహాలను డీ-డాకింగ్ చేయడంలో విజయం సాధించింది. డీ-డాకింగ్ ప్రక్రియ ద్వారా భవిష్యత్ మిషన్లలో ముఖ్యంగా చంద్రుడిపై అన్వేషించడం, మానవ సహిత అంతరిక్ష యానం, సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడం వంటి మిషన్లకు మార్గం సుగమం అయినట్లు ఇస్రో మంగళవారం తెలిపింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎక్స్‌లో ఉపగ్రహాలు విజయవంతంగా డీ-డాక్ చేయడాన్ని ప్రకటించారు.

Read Also: Virat Kohli: ఆ 14 ఏళ్ల అమ్మాయి కోహ్లీ కారణంగానే చనిపోయిందా?.. అసలు నిజం ఏంటంటే?

‘‘స్పాడెక్స్ ఉపగ్రహాలు నమ్మశక్యం కానీ డీ-డాకింగ్ సాధించాయి. ఇది భారతీయ అంతరిక్ష కేంద్రం, చంద్రయాన్-4 ,గగన్ యాన్‌తో సా ప్రతిష్టాత్మక భవిష్యత్ మిషన్లను సజావుగా నిర్వహించడానికి మార్గం సుగమమైంది’’ అని జితేంద్ర సింగ్ అన్నారు. ఇస్రో బృందానికి అభినందనలు తెలియజేయడంతో పాటు ప్రతీ భారతీయుడికి ధైర్యాన్నిస్తుందని ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రోత్సాహం మరింత ఉత్సాహాన్ని పెంచుతుందని సింగ్ చెప్పారు.

గత ఏడాది డిసెంబర్ 30న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అంతరిక్షంలో డాకింగ్ ప్రయోగాన్ని నిర్వహించింది. దీని కోసం SDX01 మరియు SDX02 అనే రెండు ఉపగ్రహాలను కక్ష్యలో ఉంచి, వాటిని అనుసంధానించడం(డాకింగ్), మళ్లీ విడివిడిగా చేయడం(డీ-డాకింగ్) వంటి ప్రయోగాలు నిర్వహించింది. అనేక ప్రయత్నాల తర్వాత, ఇస్రో జనవరి 16న రెండు ఉపగ్రహాలను విజయవంతంగా డాక్ చేసింది.