SpaDeX mission: భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) మరో ఘటన సాధించింది. స్పాడెక్స్ ఉపగ్రహాలను డీ-డాకింగ్ చేయడంలో విజయం సాధించింది. డీ-డాకింగ్ ప్రక్రియ ద్వారా భవిష్యత్ మిషన్లలో ముఖ్యంగా చంద్రుడిపై అన్వేషించడం, మానవ సహిత అంతరిక్ష యానం, సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడం వంటి మిషన్లకు మార్గం సుగమం అయినట్లు ఇస్రో మంగళవారం తెలిపింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎక్స్‌లో ఉపగ్రహాలు విజయవంతంగా డీ-డాక్ చేయడాన్ని ప్రకటించారు.