Site icon NTV Telugu

Karnataka: టూరిస్టులపై దాడి ఘటనలో ఒకరు మృతి.. నిందితుల కోసం గాలింపు

Karnataka1

Karnataka1

కర్ణాటకలో గురువారం రాత్రి తుంగభద్ర కాలువ దగ్గర ఐదుగురు టూరిస్టులపై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ముగ్గురు వ్యక్తులను కాలువలో తోసేయగా.. ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇద్దరు ఈతకొట్టుకుంటూ బయటకు రాగా.. ఒడిశాకు చెందిన బిబాష్ టూరిస్ట్ మృతదేహాన్ని శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఇది కూడా చదవండి: Ranya Rao: రన్యారావు శరీరంపై గాయాలు.. థర్డ్‌డిగ్రీ ప్రయోగించారా? అసలేమైంది?

టెక్ హబ్ బెంగళూరు నుంచి 350 కి.మీ దూరంలో ఉన్న కొప్పల్‌లోని కాలువ ఒడ్డున నిలబడి ఐదుగురు టూరిస్టులు నక్షత్రాలను వీక్షిస్తున్నారు. ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. అయితే ముగ్గురు వ్యక్తులు వచ్చి వారితో మాటలు కలిపారు. పెట్రోల్ ఎక్కడ దొరుకుతుందని అడిగారు. అనంతరం రూ.100 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు వారు నిరాకరించారు. అంతే ముగ్గురు టూరిస్టులను కాలువలోకి తోసేసి.. ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బైక్‌పై పరారయ్యారు. 27 ఏళ్ల ఇజ్రాయెల్ పర్యాటకురాలు, హోమ్‌స్టే యజమానిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.

ఇది కూడా చదవండి: Karnataka: ఉమెన్స్ డే రోజు దారుణం.. ఇజ్రాయెల్ టూరిస్ట్‌పై గ్యాంగ్‌రేప్

హోమ్‌స్టే యజమాని.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది. ముగ్గురిని కాలువలోకి తోసేయగా.. ఒక అమెరికన్, మరొక మహారాష్ట్ర అతిథి బయటకు రాగలిగారని.. ఒడిశాకు చెందిన టూరిస్ట్ ఆచూకీ లభించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చేపట్టగా… అతడి మృతదేహాన్ని శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితుల కోసం రెండు బృందాలు గాలిస్తున్నాయి. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. ప్రస్తుతం బాధితులు ప్రభుత్వాస్పత్రిలో కోలుకుంటున్నారు.

Exit mobile version