Site icon NTV Telugu

The Kashmir Files Row: ఈ వ్యాఖ్యలతో ఇజ్రాయిల్‌కు సంబంధం లేదు.. భారత్‌కు క్షమాపణలు..

The Ksahmir Files

The Ksahmir Files

Israeli diplomats apologize to India over Kashmir file issue: గోవాలో జరుగుతున్న ఐఎఫ్ఎఫ్ఐ కార్యక్రమంలో జ్యూరీ హెడ్, ఇజ్రాయిల్ దేశానికి చెందిన నాదవ్ లాపిడ్ ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపై చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, శివసేన వంటి పార్టీల నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేసేవిగా ఉండటంతో ఇజ్రాయిల్ డిప్లామాట్స్ రంగంలోకి దిగారు. నాదవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వెంటనే ఇండియాకు, అనుపమ్ ఖేర్ కు క్షమాపణలు చెప్పాలని నాదవ్ లాపిడ్ ను డిమాండ్ చేశారు ఇజ్రాయిలీ దౌత్యవేత్తలు.

ఇజ్రాయిల్ కాన్సులేట్ జనరల్ కొబ్బి శోషని మాట్లాడుతూ.. సినిమాపై నాదవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కు క్షమాపణలు చెప్పాలని మంగళవారం డిమాండ్ చేశారు. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని.. దీంతో ఇజ్రాయిల్ దేశానికి సంబంధం లేదని అన్నారు. అయితే తనకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని అనుపమ్ ఖేర్ ఇజ్రాయిల్ దౌత్యవేత్తతో చెప్పారు. ఈ సినిమా శోషనికి నచ్చిందని.. ఇజ్రాయిల్, భారత దేశాల్లో వాక్ స్వాతంత్య్రం ఉందని.. అయితే దీన్ని సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని అనుపమ్ ఖేర్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఉన్నతస్థాయి నుంచి కాల్ రావడం తనను ఆశ్చర్యపరిచిందని అన్నారు.

Read Also: The Kashmir Files: కశ్మీర్ ఫైల్స్ ఒక చెత్త సినిమా.. దీనివలనే జమ్మూకశ్మీర్ లో హత్యలు ఎక్కువ అయ్యాయి

మరోవైపు భారత్ లో ఇజ్రాయిల్ రాయబారి నూర్ గిలోన్ కూడా నాదవ్ లిపిడ్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరు చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడండి అంటూ నాదవ్ గిలాన్ వ్యాఖ్యలపై ట్వీట్ చేశాడు. ఓ బహిరంగ లేఖ ద్వారా భారతదేశానికి క్షమాపణలు చెప్పారు. భారతీయ సంస్కృతిలో, అతిథి అంటే భగవంతుని లాంటిదని వారు అంటారు.. ఐఎఫ్ఎఫ్ఐ గోవాలో ప్యానెల్ కు అధ్యక్షత వహించిన వారు భారతీయ ఆహ్వానాన్ని దుర్వినియోగం చేశారని.. నూర్ గిలోన్ ట్వీట్ చేశారు.

53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇండియా హెడ్ అయిన నాదవ్ లాపిడ్ సోమవారం ‘ది కాశ్మీర్ ఫైల్’ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా అసభ్యకరమైందిగా.. ఈ సినిమా చూసి కలవరపడ్డానని.. షాక్ అయ్యానని ఇది పోటీకి తగిన సినిమా కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై ఇజ్రాయిల్ దౌత్యవేత్తలు స్పందించి.. భారతదేశానికి క్షమాపణలు చెబుతున్నారు.

Exit mobile version