The Kashmir Files: కశ్మీర్ ఫైల్స్ ఒక చెత్త సినిమా.. దీనివలనే జమ్మూకశ్మీర్ లో హత్యలు ఎక్కువ అయ్యాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Kashmir Files: గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బాలీవుడ్ సినిమా ది కశ్మీర్ ఫైల్స్ కు ఘోర అవమానం జరిగింది. అంతర్జాతీయ వేదికపై గౌరవంగా పిలిచి ఘోరంగా అవమానించారు. ఇఫి జ్యూరీ చీఫ్ నదావ్ లాపిడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. కశ్మీర్ ఫైల్స్ అసలు ఇలాంటి ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించాల్సిన సినిమా కాదని, ఈ సినిమా దుష్ప్రచారం చేస్తుందని చెప్పుకొచ్చాడు. కశ్మీర్ ఫైల్స్ ఒక చెత్త సినిమా అని తిట్టిపోశారు. దీంతో ఈ చిత్రబృందం వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపోతే ఈ వివాదాంలోకి రాజకీయ పార్టీలు ప్రవేశించాయి. తాజాగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్, నదావ్ లాపిడ్ కు మద్దతు పలికారు. ఆయన అన్నదాంట్లో తప్పులేదని, ఈ సినిమా వలన దుష్ప్రచారం ఎక్కువ జరిగిందని చెప్పుకొచ్చారు.
“ఈ సినిమాలో ఒక వర్గం వారినే తప్పుగా చూపించారు. ఈ సినిమాను పబ్లిసిటీ చేయడంలో ఒక పార్టీ తలమునకలు కూడా అయ్యింది. కశ్మీర్ ఫైల్స్ సినిమాను ఇప్పుడు పబ్లిసిటీ చేస్తున్నవారు అప్పుడు ఏమయ్యారు. అప్పుడు వారి పిల్లలు శరణు కోరినప్పుడు ఈ ప్రభుత్వం అంతా ఎక్కడుంది. కశ్మీర్ ఫైల్స్ సినిమా విడుదల అయ్యాకే అక్కడ హత్యలు ఇంకా పెరిగాయి. దీనిమీద కశ్మీర్ ఫైల్స్ 2.o తీస్తారా..? తీసుకోండి”అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!