NTV Telugu Site icon

Benjamin Netanyahu: ఇదే ఫైనల్ కాదు.. హిజ్బుల్లాకి ఇజ్రాయిల్ పీఎం వార్నింగ్..

Benjamin Netanyahu

Benjamin Netanyahu

Benjamin Netanyahu: ఇజ్రాయిల్, లెబనాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ రోజు ఉదయం ఇజ్రాయిల్ లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటెంట్లపై వైమానిక దాడితో విరుచుకుపడింది. మరోవైపు హిజ్బుల్లా కూడా ఇజ్రాయిల్ ఉత్తర భాగంపై రాకెట్లు , డ్రోన్లతో దాడులు చేసింది. అయితే, హిజ్బుల్లా దాడుల్ని సమర్థవంతంగా అడ్డుకున్నట్లు ఇజ్రాయిల్ తెలిపింది. ఇదిలా ఉంటే ఆదివారం జరిగిన దాడి చివరిది కాదని ఇజ్రాయిల్ పీఎం బెంజమిన్ నెతన్యాహూ లెబనాన్, హిజ్బుల్లాను హెచ్చరించారు.

Read Also: Kolkata Doctor Murder: మహిళా డాక్టర్‌పై అత్యాచారం ఘటనపై.. కోల్‌కతా గణేశ్ ఉత్సవ కమిటీ సంచలన నిర్ణయం

లెబనాన్‌లో జరిగిన దాడులు ‘‘చివరి మాట కాదు’’ అని నెతన్యాహూ హెచ్చరించింది. మేము హిబ్బుల్లాని దెబ్బకొట్టామని ఆయన చెప్పారు. ఉత్తరాన ఉన్న తమ నివాసితులను సురక్షితంగా రక్షించేందుకు, ఇదే చివరి దాడులు కావని మేము వీటిని పునరావృతం చేస్తామని నెతన్యాహూ తన కేబినెట్‌ సమావేశంలో అన్నారు. ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ వేలాది షార్ట్ రేంజ్ రాకెట్లను ధ్వంసం చేసిందని, ఇవన్ని గెలీలీలోని ఇజ్రాయిల్ పౌరులకు, బలగాలకు హాని కలిగించేందుకు ఉద్దేశించివే అని చెప్పారు. అంతకుముందు ‘‘ఇజ్రాయిల్‌కి ఎవరు హాని కలిగించాలని చూస్తారో, వారిని మేము హాని కలిగిస్తాం’’ అని నెతన్యాహూ హెచ్చరించారు.

ఇజ్రాయిల్‌లోని వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులు చేసేందుకు హిజ్బుల్లా సిద్ధం చేసుకున్న అన్ని డ్రోన్లను ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ అడ్డగించినట్లు నెతన్యాహూ చెప్పారు. అయితే, మీడియా రిపోర్టుల ప్రకారం, టెల్ అవీవ్‌లోని ఇజ్రాయిల్ గూఢచార సంస్థ మొస్సాద్ టార్గెట్‌గా దాడులు జరపాలని హిజ్బుల్లా భావించినట్లు చెప్పింది.