Site icon NTV Telugu

Israel-Iran War: భయం గుప్పిట ‘‘గల్ఫ్ బతుకులు’’.. ఎంత మంది భారతీయులు ఉన్నారంటే..

Indians In Gulf

Indians In Gulf

Israel-Iran War: మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం తీవ్రంగా మారింది. ఈ ఘర్షణ రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాలేదు. యూఎస్ మిత్రదేశాలైన గల్ఫ్ లోని ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రైయిన్, ఇరాక్, కువైట్ వంటి దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. ఈ దేశాల్లోని అమెరికన్ సైనిక స్థావరాలపై ఇరాన్ మిస్సైల్ అటాక్స్ చేస్తోంది.

అయితే, ఈ యుద్ధం కారణంగా గల్ఫ్‌లో ఉంటున్న భారతీయుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దుబాయ్, సౌదీతో పాటు ఖతార్, కువైట్ దేశాల్లో్ భారతీయలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, కార్మికులుగా ఆయా దేశాల్లో పనిచేస్తున్నారు. సుమారుగా 93 లక్షల మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే భారత ప్రభుత్వం ఆయా దేశాల్లోని రాయబార కార్యాలయాలను అలర్ట్ చేసింది. భారతీయుల రక్షణ కోసం అడ్వైజరీలు జారీ చేసింది. భారతీయులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కేంద్రం హెచ్చరించింది. ఆయా దేశాల స్థానిక మార్గదర్శకాలను పాటించాలని చెప్పింది. అనవసర ప్రయాణాలను మానుకోవాలని సూచించింది. ఇజ్రాయిల్ లోని భారతీయులు బాంబ్ షెల్టర్లకు వెళ్లాలని చెప్పింది.

28 ఫిబ్రవరి 2026 నాటి తాజా గణాంకాల ప్రకారం గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల జనాభా:

*యూఏఈ (UAE): 38.9 లక్షలు
*సౌదీ అరేబియా: 26.5 లక్షలు
*కువైట్: 10 లక్షలు
*ఖతార్: 8.3 లక్షలు
*ఓమన్: 6.6 లక్షలు
*బహ్రెయిన్: 3.3 లక్షలు

Exit mobile version