Site icon NTV Telugu

Israel-Priyanka Gandhi: ప్రియాంకాగాంధీ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ కౌంటర్.. మీ మోసం సిగ్గుచేటు అంటూ వ్యాఖ్య

Israelpriyanka Gandhi

Israelpriyanka Gandhi

వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ వర్సెస్ ఇజ్రాయెల్‌గా మారింది. ఇజ్రాయెల్‌పై ప్రియాంకాగాంధీ పెట్టిన పోస్ట్ దుమారం రేపుతోంది. గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం సృష్టిస్తోందని.. ఇప్పటికే 60,000 మందికి పైగా చంపారని.. అందులో 18,430 చిన్న పిల్లలు చనిపోవడం దారుణం అన్నారు. ఇప్పుడు వందలాది మంది పిల్లలు సహా లక్షలాది ప్రజలు ఆకలితో మరణించేలా చేయడం ఘోరం అని వ్యాఖ్యానించారు. మౌనం, నిస్సాహాయత కారణంగా ఈ నేరాలకు వీలు కల్పించడం కూడా నేరమే అని అన్నారు. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ ఇంత విధ్వంసం సృష్టిస్తుంటే.. భారత ప్రభుత్వం మౌనంగా ఉండటం సిగ్గుచేటు అని ప్రియాంకాగాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనపై స్పీకర్ కీలక నిర్ణయం.. ముగ్గురితో కమిటీ ఏర్పాటు

అయితే ప్రియాంక ఆరోపణలను భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ఖండించారు. ‘‘మీ మోసం సిగ్గుచేటు’’ అని వ్యాఖ్యానించారు. జాతి నిర్మూలన వాదనను ఖండించారు. ఇజ్రాయెల్.. హమాస్ ఉగ్రవాదులను మాత్రమే చంపిందన్నారు. పౌరులను హమాస్ మానవ కవచాలుగా ఉపయోగించుకుని దారుణలకు పాల్పడిందని గుర్తుచేశారు. గాజాలోకి ఇజ్రాయెల్ 2 మిలియన్ టన్నుల ఆహారాన్ని అందించిందని చెప్పారు. కావాలనే హమాస్.. పౌరులను నిర్బంధించి.. ఆకలిని సృష్టిస్తోందని తిప్పికొట్టారు. గత 50 సంవత్సరాల్లో గాజా జనాభా 450 శాతం పెరిగిందని పేర్కొ్నారు. అక్కడ అసలు మారణహోమమే లేదన్నారు.

ఇది కూడా చదవండి: Sundarakanda : మిడిల్ ఏజ్‌లో పెళ్లి క‌ష్టాలు.. నారా రోహిత్ ‘సుందరకాండ’ ఫన్నీ ట్రైలర్

ఇక ఈ ట్వీట్‌కు ముందు ప్రియాంకాగాంధీ మరొక పోస్ట్ చేశారు. గాజాలో ఇటీవల ఇజ్రాయెల్ రాకెట్ దాడిలో ఐదుగురు జర్నలిస్టులు చనిపోయారు. దీన్ని కూడా ఆమె తప్పుపట్టారు. అల్ జజీరా జర్నలిస్టుల హత్యను కోల్డ్ బడ్లెడ్ మర్డర్‌గా అభివర్ణించారు. సత్యం కోసం నిలబడటానికి ధైర్యం చేసే వారిని ఇజ్రాయెల్ సైన్యం హింస, ద్వేషం ద్వారా ఎప్పటికీ విచ్ఛన్నం చేయలేదని పేర్కొన్నారు.

ఈ విధంగా ప్రియాంకాగాంధీ ఇజ్రాయెల్‌ను విమర్శించడం ఇదే తొలిసారి కాదు. పలుమార్లు ఇజ్రాయెల్‌ను తప్పుపట్టారు. అంతేకాకుండా పాలస్తీనాకు మద్దతుగా ఆ మధ్య పార్లమెంట్‌కు బ్యాగ్ వేసుకుని వచ్చారు. ఇలా పలుమార్లు పాలస్తీనాకు ప్రియాంకాగాంధీ మద్దతు తెలిపారు.

 

Exit mobile version