ISIS: చదివింది ఇంజనీరింగ్.. చేస్తున్నది టెర్రరిజం.. ఐసిస్ కుట్రలో సంచలన విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ISIS: ఢిల్లీ పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. మోస్ట్ వాంటెండ్ అనుమానిత ఐసిస్ ఉగ్రవాది షానవాజ్‌ని అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సోమవారం తెలిపింది. తెల్లవారుజామున జైత్పూర్ లో షానవాజ్‌ని అరెస్ట్ చేశారు. అతనితో పాటు మరో ఇద్దరు వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరిని మహ్మద్ రిజ్వాన్ అష్రాఫ్, మహ్మద్ అర్షద్ వార్సిగా గుర్తించారు. అష్రాఫ్ ని లక్నోలో అరెస్ట్ చేయగా.. అర్షద్ ని మొరాదాబాద్ లో పట్టుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పాకిస్తాన్ హ్యండర్ల నుంచి పంపిన ఉగ్రవాద సాహిత్యం, బాంబు తయారీ వివరాలు ఇతర నేరారోపణ పత్రాలను షానవాజ్ నివాసం నుంచి స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉంటే పట్టుబడిన ఉగ్రవాది షానవాజ్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. షానవాజ్ అతని సన్నిహితులు ముగ్గురు కలిసి పశ్చిమ కనుమలు, కర్ణాటకలోని హుబ్బలి, ధార్వాడ్, గుజరాత్ లోని అహ్మదాబాద్ ప్రాంతాల్లో రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి రెక్కీ నిర్వహించినట్లు తేలింది.
Also Read
- MP: ‘సారీ అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు’.. కన్నీరు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ నోట్
- Aadhaar Mobile Number Update: ఆధార్‌లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
- BK Hariprasad: కర్ణాటక కాంగ్రెస్ పగ్గాలు ఆయనకే.. ఎవరో తెలుసా?
- Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
Read Also: Vinayaka Temple : ఆ వినాయక గుడికి వెళితే.. పెళ్లిళ్లు జరుగుతాయట.. ఆ గుడి ఎక్కడుందంటే?
షానవాజ్ విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మైనింగ్ ఇంజనీరింగ్ చదివాడు. అతని భార్య బసంతి పటేల్ ని ఇస్లాం మతంలోకి మార్చాడు. ప్రస్తుతం ఆమె పేరు మరియమ్ అని ఢిల్లీ పోలీస్ అధికారి హెచ్ఎస్ ధాలివాల్ తెలిపారు. ప్రస్తుతం పట్టుబడిన ముగ్గురిని కోర్టులో హజరు పరచగా..7 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది.
గత నెలలోనే ఐసిస్ మాడ్యుల్ పై ఎన్ఐఏ షానవాజ్ తో పాటు మరో నలుగురి చిత్రాలను విడుదల చేసింది. వీరిపై రూ. 3 లక్షల రివార్డు ప్రకటించింది. మహ్మద్ అర్షద్ అలీగఢ్ యూనివర్సిటీ నుంచి బీటెక్ పట్టా పొందాడు, జామియా మిలియాలో పీహెచ్డీ చేస్తున్నాడు. మహ్మద్ రిజ్వాన్ కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ చేశాడు. ఇతను మత పండితుడిగా శిక్షణ తీసుకుంటున్నాడు. నిందితులు వీవీఐపీలను టార్గెట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రదేశాల్లో బాంబు పేలుళ్లకు కుట్ర చేస్తున్నారు.
- Tags
- Delhi
- Delhi police
- ISIS
- terrorism
తాజావార్తలు
-
Prabhas : ‘స్పిరిట్’ పవర్ఫుల్ డైలాగ్ లీక్? థియేటర్స్ షేక్ అవడం గ్యారెంటీ
-
OTT : పెద్ద సినిమాలకు ఓటీటీ డీల్ కాకుంటే రిలీజ్ డేట్ ప్రకటించరా?
-
Google AI Scam Call Detection: గూగుల్ నుంచి కొత్త AI స్కామ్ కాల్ డిటెక్షన్ ఫీచర్.. యూజర్లకు భారీ ఊరట
-
Donald Trump: సొంత పార్టీ నుంచే ట్రంప్‌కు ఎదురుదెబ్బ! అమెరికా పార్లమెంట్లో సంచలనం.. ఏం జరిగిందంటే?
-
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!