Site icon NTV Telugu

Bangladesh: బంగ్లా సైన్యాన్ని దెబ్బతీసేందుకు పాక్ ఐఎస్ఐ కుట్ర.. నిఘా నివేదికలో సంచలన విషయాలు..

Bangla

Bangla

Bangladesh: బంగ్లాదేశ్ ఇప్పుడు ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. అక్కడి రాడికల్ ఇస్లామిక్ శక్తులు ఆ దేశాన్ని కబ్జా చేయాలని చూస్తున్నాయి. ఇదే కాకుండా, అంతర్గత వర్గ పోరును కూడా భారత్‌కు ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ, రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హాది హత్య. దీంట్లో భారత ప్రమేయం ఉందని చెబూతూ, అక్కడి మతోన్మాద మూక ఢాకాలోని భారత ఎంబసీపై దాడి చేసే యత్నం చేసింది. రాజకీయ, మత శక్తులు తమ ప్రయోజనం కోసం ప్రభుత్వ సంస్థల్ని ఉద్దేశపూర్వకంగా బలహీన పరుస్తున్నాయని ఒక నిఘా నివేదిక స్పష్టంగా చెప్పింది. ముఖ్యంగా, బంగ్లాదేశ్ ఆర్మీని బలహీనపరచాలని పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కుట్ర చేస్తోందని రిపోర్ట్ పేర్కొంది.

బంగ్లా సైన్యాన్ని అస్థిరపరిచే కుట్ర..

భారత వ్యతిరేక శక్తులు, రాడికల్ ఇస్లామిస్ట్ శక్తులు ఈ పరిస్థితిని ఉపయోగించుకుంటున్నాయి. భారత్‌తో ఘర్షణ వైపు బంగ్లాను ఉసిగొలపాలని మతోన్మాదుల్ని, మీడియా కథనాలను, సముద్ర సరిహద్దుల్లో మత్స్యకారుల్ని ఉపయోగిస్తున్నారు. బంగ్లాదేశ్ ఆర్మీని బలహీనపరిచే కుట్ర దాగున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న యూనస్ ప్రభుత్వం, మతన్మాద సంస్థలైన జమాతే ఇస్లామి వంటి సంస్థలు యాంటీ-ఇండియా కథనాన్ని రూపొందిస్తున్నప్పటికీ, బంగ్లా సైన్యంతో భారత్ సంప్రదింపులు జరుపుతూనే ఉంది. ముఖ్యంగా, షేక్ హసీనా పదవీచ్యుతి సందర్భంలో బంగ్లా ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్, భారత ఆర్మీ చీఫ్‌తో మాట్లాడారు. ఇది భారత వ్యతిరేకులకు నచ్చడం లేదు.

సైన్యాన్ని టార్గెట్ చేస్తున్నారు.

బంగ్లా సైన్యంలో మధ్యస్థాయి అధికారుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. పోలీస్ వ్యవస్థ దాదాపు నిష్క్రియంగా ఉంది. సైన్యం అయిష్టంగానే మొదటి ప్రతిస్పందనదారుడి పాత్రను పోషిస్తోంది. మధ్య స్థాయి అధికారులు తమకు స్పష్టమైన రాజకీయ మద్దతు, చట్టపరమైన రక్షణ లేదని ఫిర్యాదు చేస్తున్నారు. వీధుల్లో పరిస్థితిని నిర్వహిస్తున్నప్పటికీ, ప్రతీ నిర్ణయం భవిష్యత్తులో ప్రతీకారం తీర్చుకుంటారనే భయానికి లోబడి ఉంది. ఇది సైన్యంలో నైతికతను క్షీణించేలా చేస్తోంది.

ఐఎస్ఐ కుట్ర:

పాకిస్తాన్ నిఘా సంస్థ, ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI), బంగ్లాదేశ్ సైనిక నిర్మాణాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. వివిధ స్థాయిలో గందరగోళం సృ‌ష్టిస్తోందని నిఘా వర్గాలు సూచిస్తున్నాయి. ఈ జోక్యం సైన్యం ఐక్యత, విశ్వాసాన్ని దెబ్బతీసి, అస్థిరతకు కారణం అవుతోంది. అల్లర్లు, దుండగులపై చర్యల విషయంలో వివక్ష అనే భావన సైన్యంలో పెరుగుతోంది.

భారత్ కు ముప్పు ఏమిటి?

భారత్‌ లాంటి పెద్ద దేశాన్ని, బంగ్లాదేశ్ వంటి బురద పాము ఏం చేయలేదు. కానీ పరిస్థితులు అస్థిరంగా ఉంటే మాత్రం భారత్‌లోకి వలసలు పోటేత్తే అవకాశం ఉంది. ఇది భారత అంతర్గత భద్రతను, సరిహద్దు సమస్యల్ని పెంచుతుంది. చొరబాటు, అక్రమరవాణా, ఉగ్రవాద ముప్పు పెరుగుతుంది. బంగ్లాదేశ్‌లో ఇలాంటి పరిస్థితులే ఉంటే, ఇది మొత్తం తూర్పు , ఈశాన్య భారతదేశాలకు, బంగాళాఖాతంలో భద్రతపై ప్రభావం చూపుతుంది. బంగ్లాదేశ్ పరిస్థితి ఒక ఉద్దేశపూర్వం కుట్ర ద్వారా దిగజారుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

Exit mobile version