Site icon NTV Telugu

Pakistan: టర్కీ, అజర్ బైజాన్ పర్యటనకు పాక్ ప్రధాని షహబాజ్.. కారణం ఇదేనా..

Pakistan

Pakistan

Pakistan: భారత్ చేతిలో చావు దెబ్బతిన్న తర్వాత పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన మిత్రదేశాల పర్యటనకు వెళ్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్‌, పీఓకేలోని 09 ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో 100కు పైగా ఉగ్రవాదులు మరణించారు. ఆ తర్వాత పాక్ సైన్యం, భారత్‌పై దాడి చేయడానికి యత్నించింది. దీనికి బదులుగా పాక్ లోని 11 వైమానిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసి గట్టి బుద్ధి చెప్పింది.

Read Also: Mysuru Suicide: ప్రియుడితో వెళ్లిపోయిన కూతురు.. చెరువులో దూకి కుటుంబం ఆత్మహత్య..

ఈ పరిణామాల తర్వాత భారత్, పాకిస్తాన్ చేస్తున్న ఉగ్రవాదంపై దౌత్య బృందాలను పలు దేశాలకు పంపించింది. దీనిపై పాకిస్తాన్‌లో ఆందోళన ఉన్నట్లు తెలుస్తోంది. తాము ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నామని భారత్ ప్రపంచదేశాల ముందు బయటపెడుతుందని పాక్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే, ఇటీవల తమకు బహిరంగంగా మద్దతు ప్రకటించిన టర్కీ, అజర్ బైజాన్ పర్యటనకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెళ్తున్నారు. వీటితో పాటు తజకిస్తాన్, ఇరాన్‌లో కూడా పర్యటించనున్నారు. మే 25-30 వరకు ఈ పర్యటన సాగుతోంది.

పాక్ తీరును భారత్ బహిరంగంగా ఎండగడుతుండటంతో టర్కీ, అజర్ బైజాన్ మద్దతును మరింతగా కూడగట్టేందుకు ఆయా దేశాల్లో షరీఫ్ పర్యటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల, ఆపరేషన్ సిందూర్ సమయంలో టర్కీ తన డ్రోన్లను ఇచ్చింది. ఈ డ్రోన్ల ద్వారా పాక్ భారత్‌పై దాడి చేసింది. ఇదే కాకుండా ఇద్దరు టర్కిష్ డ్రోన్ ఆపరేటర్లను కూడా పాకిస్తాన్‌లో ఉంచింది. భారత ప్రతిదాడుల్లో టర్కీ డ్రోన్లతో పాటు ఇద్దరు టర్కిష్ వ్యక్తులు కూడా మరణించారు. అజర్‌బైజాన్ కూడా పాకిస్తాన్‌కు అండగా నిలిచింది. ఉగ్రవాద శిబిరాలపై భారత సైనిక దాడులను ఖండిస్తూ, పాకిస్తాన్ ప్రజలకు సంఘీభావం తెలిపింది.

Exit mobile version