NTV Telugu Site icon

Gautam Adani: ట్రంప్‌కి అదానీ మద్దతు.. కావాలనే బైడెన్ టార్గెట్ చేస్తున్నాడా..?

Adani

Adani

Gautam Adani: గౌతమ్ అదానీపై మరోసారి అమెరికా ఆరోపణలు చేసింది. విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి నాలుగు రాష్ట్రాల్లోని అధికారులకు లంచం ఇచ్చారని అభియోగాలు ఎదుర్కొంటోంది. అమెరికాకు చెందిన అజూర్ పవర్‌తో కలిసి అదానీ గ్రీన్ ఎనర్టీ, SECIతో 12 GW సౌర విద్యుత్ ఒప్పందాన్ని పొందిందని అభియోగపత్రంలో ఆరోపించింది. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలను ఖరీదైన విద్యుత్ ఒప్పందాలు అంగీకరించేలా చేయడానికి, ఈ కంపెనీలు భారతదేశంలోని నాలుగు రాష్ట్రాలకు 256 మిలియన్ డాలర్లు లంచంగా ఇచ్చారని ఆరోపించింది.

అయితే, అదానీ గ్రూప్ ఈ ఆరోపణల్ని ఖండించింది. ఈ ఆరోపణల్లో అమెరికాలోని జోబైడెన్ ప్రభుత్వ కుట్ర ఏమైనా ఉందా..? అని ఓ వర్గం చర్చిస్తోంది. ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్‌ని చంపేందుకు కాల్పులు జరిగాయి. తృటిలో ట్రంప్ తప్పించుకున్నాడు. ఆ సమయంలో అదానీ ట్రంప్‌కి మద్దతుగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం అమెరికాలోని డెమెక్రాట్లకు, డెమెక్రాట్ లాబీయిస్టులకు మద్దతుతో చైనాకు కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్న యునైటెడ్ స్టేట్స్ ఇన్‌ఫ్రా అండ్ ఎనర్జీ ప్రాజెక్టులో 10 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడుతానని హామీ ఇచ్చారని తెలుస్తోంది.

Read Also: Galla Ashok: దేవకీ నందన వాసుదేవ’ డివైన్ ఎలిమెంట్స్, ట్విస్ట్ లు అదిరిపోతాయి!

దీంతో పాటు చైనా దురాక్రమణను ఎదుర్కోవడానికి అదానీ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. అదానీ కొలంబోలో ఒక ఓడరేవును, ఇజ్రాయిల్ హైఫాలో, టాంజానియాల్లో ఓడరేవుల్ని నిర్మిస్తున్నాడు. ఇది భౌగోళిక రాజకీయాల్లో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే త్వరలో దిగిపోబోతున్న బైడెన్ ప్రభుత్వం కావాలనే ఈ ఆరోపణలు చేస్తోందని కొందరు తమ వాదనని వినిపిస్తున్నారు. గతంలో హిండెన్ బర్గ్‌ రిపోర్టులాగే తాజా ఆరోపణలు భారతీయ వ్యాపారుల పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నాయని మండిపడుతున్నారు.

దీనికి తోడు మరో నాలుగు రోజుల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఆరోపణలు రావడం ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీని అస్థిరపరిచే కుట్రగా అభివర్ణిస్తున్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వక్ఫ్ బిల్లు వంటి కీలక బిల్లులు సభ ముందుకు రాబోతున్నాయి. ఈ లోపే అదానీ కేంద్రంగా రాజకీయ దుమారం చెలరేగింది. ఈ అన్ని పరిణామాలు కూడా కుట్ర కోణం ఏదైనా ఉందా..? అనే అనుమానాలనున లేవనెత్తుతున్నాయి.

అదానీపై నేరాలు మోపిన ప్రాసిక్యూటర్ బ్రియాన్ పీస్. ఇతడికి డెమెక్రాట్ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. సోషల్ మీడియా పోస్టుల ప్రకారం.. బ్రియాన్ పీస్‌కి డెమెక్రాట్ సెనెటర్ చక్ షుమెర్‌తో చాలా సంబంధాలు ఉన్నాయి. పీస్ జ్యుడిషియల్ నియామకంలో షుమెర్ పాత్ర ఉంది. ఇతడి నియామకంపై 2021లో వివాదం చెలరేగితే, షమెర్ మద్దతు తెలిపాడు. దీనిని బట్టి చూస్తే అదానీపై కేసులో పొలిటికల్ ఎజెండా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ షెమెర్‌కి డీప్ స్టేట్‌ని నడిపిస్తున్న బిలియనీర్ జార్జ్ సోరెస్‌తో సంబంధం ఉంది. సోరొస్ కొడుకు అలెక్స్‌కి షుమెర్ సన్నిహితుడిగా చెప్పబడుతున్నాడు. 2024 అధ్యక్ష ఎన్నికల సమయంలో షుమెర్‌కి సోరోస్ ఫండింగ్ చేసినట్లు తెలుస్తోంది. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, కమలా హారిస్,హిల్లరీ క్లింటన్, జో బైడెన్, జార్జ్ సోరోస్ డీప్ స్టేట్‌లో భాగమనే ఆరోపణలు ఉన్నాయి. ట్రంప్ ఎన్నికైన తర్వాత కోర్టుల్లో జడ్జిలుగా వ్యవహరిస్తున్న రాడికల్ లెఫ్ట్ భావాలు ఉన్నవారిని తొలగిస్తానని ప్రకటించారు. వీటిని ఆధారంగా కొందరు ఈ వ్యవహారంలో రాజకీయ ఎజెండా ఉందనే అనుమానాలను వ్యక్తం చేస్తుంది.