PIB Fact Check: రూ.500 నోట్లు చెలామణిపై అనుమానాలు.. నిజమెంత..?

  • రూ. 500 నోట్లు వచ్చే ఏడాది మార్చి నాటికి నిలిచిపోతాయంటూ ప్రచారం..
  • ఈ ఫేక్ ప్రచారం పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం వెల్లడి..
  • రూ.500 నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి: పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం..
500

500

PIB Fact Check: ప్రస్తుతం భారతదేశంలో చెలామణిలో ఉన్న 500 రూపాయల నోట్లు వచ్చే ఏడాది మార్చి వరకు దశల వారీగా నిలిచిపోతాయంటూ కొనసాగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఓ ఛానల్‌కు సంబంధించిన యూట్యూబ్‌ వీడియోలో ఆర్‌బీఐ రూ.500 నోట్ల చెలామణిని 2026 మార్చి నాటికి బంద్ చేస్తారన్న అసత్య ప్రచారం జరుగుతోందని చెప్పుకొచ్చింది. ఈ ఫేక్ ప్రచారం పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం ఎక్స్‌ (ట్విట్టర్)లో ఓ పోస్టు పెట్టింది. “ఆర్‌బీఐ అలాంటి ప్రకటన ఏం చేయలేదు.. రూ.500 నోట్లు నిలుపుదల కావు, అవి చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి అని వెల్లడించింది.

Read Also: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై సంచలన విషయాలు.. నష్టాన్ని బయటపెట్టిన అధికారులు…!

అయితే, చాలా రోజుల నుంచి ఇలాంటి అసత్య వార్తలు ప్రసారం అవుతున్నాయి.. ప్రజలు ఎవరు కూడా ఈ ఫేక్ న్యూ్స్ ను నమ్మొద్దని పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం విజ్ఞప్తి చేసింది. ఏదైనా వార్తను నమ్మడం, మరొకరికి షేర్‌ చేసే ముందు అధికారిక వర్గాల నుంచి సరైనా సమాచారం ధ్రువీకరించుకోవాలని ప్రజలకు ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం సూచించింది.