NTV Telugu Site icon

పార్ల‌మెంట్ సీట్ల సంఖ్య పెరగ‌నుందా? కేంద్రం ఏం చెబుతున్నది?

దేశంలో ప్ర‌స్తుతం ఉన్న 545 పార్ల‌మెంట్ స్థానాల‌ను పెంచే యోచ‌న‌లో కేంద్రం ఉన్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ఉన్న కేంద్ర 545 స్థానాల‌ను 1000 కి పెంచాల‌ని కేంద్రం నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని కాంగ్రెస్ ఎంపీ మ‌నీష్ తివారీ ట్వీట్ చేయ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.  బీజేపీకి చెందిన ప‌లువురు ఎంపీలు త‌న‌తో ఈ విష‌యం గురించి చెప్పార‌ని, మ‌నీష్ తివారీ పేర్కొన్నారు.  అందుకోస‌మే కొత్త‌గా నిర్మిస్తున్న పార్ల‌మెంట్‌లోని లోక్ స‌భ‌ను 1000 మంది కూర్చుకే విధంగా తీర్చిదుద్దుతున్నారని మ‌నీష్ తివారీ పేర్కొన్నారు.  2021 జ‌నాభా ప్రాతిప‌దిక‌గా పార్ల‌మెంట్ స్థానాలను పెంచితే ఇబ్బందులు ఎదురయ్యే అవ‌కాశం ఉన్న‌ది.  

Read: టీఆర్పీ పెంచేలా… ఆర్పీ పట్నాయక్… బుల్లితెర గెస్ట్ అప్పియరెన్స్!

జ‌నాభా నియంత్ర‌ణ విష‌యంలో ద‌క్షిణాది రాష్ట్రాలు ముందు ఉన్నాయి.  జ‌నాభా ప్రాతిప‌దిక‌న ఇప్ప‌టికిప్పుడు పార్ల‌మెంట్ స్థానాల సంఖ్య‌ల‌ను పెంచాల్సి వ‌స్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పార్ల‌మెంట్ సీట్లు 25 నుంచి 52 కి పెరుగుతాయి.  అదే విధంగా తెలంగాణ‌లో పార్ల‌మెంట్ సీట్లు 17 నుంచి 39 కి పెరుగుతుంది.  అయితే, ఉత్త‌రాది రాష్ట్ర‌మైన యూపీలో ప్ర‌స్తుతం ఉన్న 80 సీట్ల నుంచి 193 సీట్ల‌కు పెరిగే అవ‌కాశం ఉన్న‌ది.  అయితే, రాజ్యాంగం ప్ర‌కారం 2026 వ సంవ‌త్స‌రం త‌రువాత త‌ప్ప‌ని స‌రిగా పార్ల‌మెంట్ సీట్ల‌ను పెంచాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉన్నది.  అయితే, బీజేపీ మాత్రం ఇప్ప‌ట్లో పార్ల‌మెంట్ సీట్ల‌ను పెంచే యోచ‌న లేన‌ట్టుగా చెప్తున్న‌ది.  రాజ్యాంగం ప్ర‌కార‌మే సీట్లు పెంచే అవ‌కాశం ఉంద‌ని నేత‌లు చెబుతున్నారు.