NTV Telugu Site icon

Garlic: వెల్లుల్లి కూరగాయా..? లేదా మసాలా..? దశాబ్ధాల చర్చకు హైకోర్టు పరిష్కారం..

Garlic

Garlic

Garlic: భారతీయ వంటకాల్లో వెల్లుల్లి చాలా ప్రముఖం. వంటల్లో వెల్లుల్లిని వాడితే దాని రుచి, సువాసన అమోఘంగా ఉంటుంది. సాధారణంగా దాని ఘాటు వాసన కారణంగా దీనిని వంటల్లో తరుచుగా మసాలాగా పరిగణించబడుతుంది. అయితే, ఈ వెల్లుల్లి మధ్యప్రదేశ్‌లో దశాబ్ధకాలంగా చర్చనీయాంశంగా మారింది. వెల్లుల్లి కూరగాయనా..? లేదా మసాలా..? అనే విషయంపై సాగుతున్న చర్చకు మధ్యప్రదేశ్ హైకోర్ట్ ఫుల్‌స్టాప్ పెట్టింది.

వెల్లుల్లి కూరగాయ అని, దీనిని కూరగాయల మార్కెట్, మసాలా మార్కెట్ రెండింటిలో విక్రయించేందుకు అనుమతినిస్తూ హైకోర్టు తీర్మానం చేసింది. వెల్లుల్లిని సుగంధ ద్రవ్యంగా వర్గీకరిస్తూనే, కూరగాయగా పరిగణించేందుకు అనుమతించడం ద్వారా రైతులకు, వ్యాపారులకు ఈ తీర్పు ప్రయోజనం చేకూరుస్తోందని భావిస్తున్నారు. కూరగాయలు, మసాలా మార్కెట్‌లో విక్రయించడానికి ఈ తీర్పు అనుమతిస్తుంది.

వెల్లుల్లి దాని రుచికి ప్రసిద్ధి చెందింది. దాని బలమైన రుచి, వాసన కారణంగా వంటల్లో మసాలాగా పరిణించబడుతోంది. అయితే, వృక్షశాస్త్ర పరంగా చూస్తే దీనిని కూరగాయగా వర్గీకరించబడింది. 2015లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక రైతు సంస్థ వెల్లుల్లిని కూరగాయగా వర్గీకరించడానికి మధ్యప్రదేశ్ మండి బోర్డును ఒప్పించిన వివాదంపై కోర్టు ఈ తీర్పు చెప్పింది. అయితే, వ్యవసాయ శాఖ 1972 వ్యవసాయోత్పత్తి మార్కెట్ కమిటీ చట్టం ప్రకారం వెల్లుల్లిని మసాలాగా తిరిగి వర్గీకరించడం ద్వారా వెంటనే ఈ చర్యను మార్చేసింది.

Read Also: AP Super Speciality Hospitals: ప్రభుత్వానికి ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నోటీసు

ఈ నిర్ణయం వల్ల ఏ రాష్ట్ర ప్రభుత్వ మార్కెట్లు అయినా వెల్లుల్లిని విక్రయించగలవు. ఇది రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది కమీషన్ ఏజెంట్లను ప్రభావితం చేయగలవు. దీంతో బంగాళాదుంప, ఉల్లిపాయ, వెల్లుల్లి కమీషన్ ఏజెంట్ అసోసియేషన్, ప్రిన్సిపల్ సెక్రటరీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 2016లో ఇండోర్ బెంచ్ హైకోర్టుని ఆశ్రయించింది. 2017లో సింగిల్ జడ్జ్ బెంజ్ అసోషియేషన్‌కి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో వ్యాపారుల మధ్య వివాదం చెలరేగింది. ఈ నిర్ణయం రైతుల కన్నా ఏజెంట్లు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందని వాదించారు.

జూలై 2017లో ముఖేస్ సోమని దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై జస్టిస్ ఎస్ఏ ధర్మాధికారి, జస్టిస్ డి వెంకటరామన్‌లతో కూడిన ఇండోర్ బెంచ్ ఇటీవల ఉత్తర్వులను జారీ చేసింది. హైకోర్టు జెంచ్ 2017 తీర్పును సమర్థించింది. గతంలో వెల్లుల్లి విక్రయాల విధానాన్ని పునరుద్ధరించింది. దీని ద్వారా రైతులు తమ ఉత్పత్తులను ఏజెంట్లు ఎలాంటి కమీషన్ చెల్లించకుండా నేరుగా మార్కె‌ట్‌లో విక్రయించవచ్చు. హైకోర్టు తీర్పులో.. వెల్లుల్లి పాడైపోయేదని అందువల్ల కూరగాయ అని తీర్పు చెప్పింది. మొక్కను కూరగాలు, సుగంధ ద్రవ్యాల మార్కెట్‌లో విక్రయించవచ్చని కూడా తీర్పులో పేర్కొంది.

Show comments