NTV Telugu Site icon

Iran: ఇండియా ‘బిగ్ పవర్’’.. ఇజ్రాయిల్ మారణహోమాన్ని ఆపగలదు..

Iran Israel Tension

Iran Israel Tension

Iran: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలకు కారణమైంది. ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య ఏక్షణమైనా యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్ అధ్యక్షుడు ప్రమాణస్వీకార కార్యక్రమానికి టెహ్రాన్ వచ్చిన సమయంలో హనియే హత్య జరిగింది. అయితే, ఈ హత్య చేసింది ఇజ్రాయిల్‌ అని ఇరాన్‌తో పాటు దాని ప్రాక్సీలు హమాస్, హిజ్బుల్లా ఆరోపిస్తున్నాయి. ఈ దాడికి తప్పకుండా పరిణామాలు ఎదుర్కోవాల్సిందే అని ఇజ్రాయిల్‌కి ఇరాన్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇరాన్ యుద్ధానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హిజ్బుల్లా లెబనాన్ నుంచి ఇజ్రాయిల్ ఉత్తర ప్రాంతంపై వరసగా దాడులకు చేస్తోంది.

Read Also: Sheikh Hasina: షేక్ హసీనా విమానం ఇండియాలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఏం జరిగింది..?

ఇదిలా ఉంటే భారతదేశంలో ఇరాన్ రాయబారి డాక్టర్ ఇరాజ్ ఎలాహి మాట్లాడుతూ, ఇజ్రాయిల్ మారణహోమాన్ని ఆపే శక్తి భారత్‌కి ఉందని అన్నారు. గాజాలో ఇజ్రాయిల్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి తాను భారత్ ఒక ముఖ్యమైన దేశమని, బిగ్ పవర్ అని, అంతర్జాతీయ సమాజంలో ప్రభావవంతమైన దేశం అని తాను పదేపదే ప్రస్తావించిన విషయాన్ని ఆయన వెల్లడించారు. ఈ ప్రాంతంలో సంక్షోభంలో ఇండియా చురుకైన పాత్ర పోషించగలదని, ఇజ్రాయిల్ పాలక పక్షంతో, ఇజ్రాయిల్ ప్రభుత్వంతో భారత్ మంచి సంబంధాలు కలిగి ఉందని, గాజాలో మారణహోమాన్ని ఆపడానికి, నేరాలు తగ్గించడానికి, పాలస్తీనాలో శాంతిని నెలకొల్పడానికి వారిని ఒప్పేంచే దేశం భారత్ అని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి భారత్ తన ప్రభావాన్ని, శక్తిని ఉపయోగించుకునేలా మేము ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.

Show comments