LPG: ఇరాన్ యుద్ధం భారత్ ఇంధన సంక్షోభాన్ని పెంచింది. ముఖ్యంగా ఎల్పీజీ సంక్షోభం ఏర్పడింది. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ కంట్రోల్ చేస్తుంది. ఈ మార్గం గుండా వెళ్లే నౌకల్ని టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే, భారత్ లాంటి మిత్ర దేశాలకు హార్ముజ్ జలసంధి తెరిచే ఉంటుందని ఇరాన్ ప్రకటించింది.
Read Also: Tollywood : నాకు దురంధర్ మ్యూజిక్ డైరెక్టరే కావాలంటున్న టాలీవుడ్ స్టార్ హీరో
ఇదిలా ఉంటే, భారత్‌కు వస్తున్న మరో రెండు ఎల్పీజీ ట్యాంకర్లకు శనివారం ఇరాన్ అనుమతి ఇచ్చింది. తాజా షిప్పింగ్ డేటా ప్రకారం.. BW ELM, BW TYR అనే ట్యాంకర్లు హార్ముజ్ నుంచి ఒమన్ గల్ఫ్ మీదుగా భారత్ వైపు వస్తున్నాయి. భారత జెండా కలిగిన ఈ రెండు ట్యాంకర్లు ఒకదానికొకటి దగ్గరగా ప్రయాణిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో భారత తీరానికి రాబోతున్నాయి. ఎల్పీజీపై భయాలు నెలకొన్న తరుణంలో ఈ రెండు షిప్‌లు రావడం ఊరట కలిగించే విషయం. ఇదే కాకుండా ముడి చమురును తీసుకువెళ్తున్న మరో ఐదు భారతీయ ట్యాంకర్లు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సమీపంలోని జలాల్లో ఇంకా లంగరు వేసి ఉన్నాయి.
