Site icon NTV Telugu

Bhagwant Mann: పంజాబ్ సీఎంకి కాబోయే భార్య వయసు, వృత్తి గురించి తెలుసా..?

Gurpreeth Kaur

Gurpreeth Kaur

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రేపు రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటికే వివాహం అయిన 48 ఏళ్ల మాన్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆరేళ్ల క్రితం తన భార్య ఇంద్రప్రీత్ కౌర్ కు విడాకులు ఇచ్చాడు సీఎం మాన్. అయితే తాజాగా మరో అమ్మాయిని పెళ్లిచేసుకోబోతున్నాడు. అత్యంత సన్నిహితులు, కుటుంబీకుల సమక్షంలో చంఢీగడ్ లో వివాహం జరగనుంది. పంజాబ్ లో తొలిసారి పాగా వేసిన ఆప్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

Read Also: Saji Cheriyan: రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మంత్రి పదవి ఊడింది..

సీఎం భగవంత్ మాన్, 32 ఏళ్ల పంజాబీ అమ్మాయి గురుప్రీత్ కౌర్ ను వివాహం చేసుకోనున్నారు. కౌర్ ఫ్యామిలీ హర్యానాలోని కురుక్షేత్రలోని పెహ్వా ప్రాంతంలో నివాసం ఉంటారు. గురుప్రీత్ కౌర్ తండ్రి ఇందర్‌జిత్ సింగ్ సాధారణ రైతు కుటుంబానికి చెందిన వారు. తల్లి మాతా రాజ్ కౌర్ గృహిణి. గురుప్రీత్ కౌర్ ఇద్దరు సిస్టర్స్ విదేశాల్లో ఉంటున్నారు. సీఎం భగవంత్ మాన్ కుటుంబానికి గురుప్రీత్ కౌర్ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. డాక్టర్ అయిన గురుప్రీత్ కౌర్ ముల్లానా మెడికల్ కాలేజీలో వైద్యవిద్యను అభ్యసించింది. దీంతో పాటు ఆమె గోల్డ్ మెడలిస్ట్. అయితే పంజాబ్ ఎన్నికల సమయంలో గురుప్రీత్, భగవంత్ మాన్ కు చేదోడుగా ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ పెళ్లిని భగవంత్ మన్ తల్లి, చెల్లి కుదిర్చారని తెలుస్తోంది.

Exit mobile version