Inspirational News: కొడుకును ఆదర్శంగా తీసుకున్న తండ్రి. డాక్టర్ అయ్యేందుకు 55 ఏళ్ల వయసులో ‘నీట్’కి హాజరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Inspirational News: సహజంగా తండ్రిని కొడుకు ఆదర్శంగా తీసుకుంటాడు. కానీ ఈ కథ వేరు. తండ్రే కొడుకు బాటలో నడిచాడు. డాక్టర్ అవ్వాలనే జీవితాశయాన్ని నెరవేర్చుకునేందుకు ఏకంగా 55 ఏళ్ల వయసులో ‘నీట్’కి హాజరయ్యాడు. అతని పేరు కె.రాజ్యక్కొడి. తమిళనాడులోని మదురై వాసి. రైతు. తెల్ల చొక్కా వేసుకున్నాడు. నెత్తి మీద జుట్టు కూడా తెల్లబడింది. మదురైలో మొన్న ఆదివారం జరిగిన నేషనల్ ఎంట్రన్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(నీట్)కి హాజరయ్యేందుకు విద్యార్థులందరితోపాటు లైన్లో నిల్చున్నాడు. పరీక్ష కేంద్రంలోకి వెళ్లటానికి అతని వంతు రాగానే సెక్యూరిటీ గార్డులు ఆపారు.
ఇంత వయసులో నువ్వు ఈ పరీక్ష రాయటానికి రావటమేంటి అనే అర్థం వచ్చేలా లుక్కేశారు. వాళ్లు ఆపినందుకు ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఎవరికైనా ఈ డౌట్ వస్తుంది. దీంతో ఆయన తన చేతిలో ఉన్న హాల్ టికెట్‌ను చూపించగా మారుమాట్లాడకుండా లోపలికి అనుమతించారు. దీంతో అక్కడున్నవాళ్లందరూ అవాక్కయ్యారు. తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు, పరీక్ష కేంద్రం నిర్వాహకులు ముక్కు మీద వేలేసుకున్నారు. ఒకరినొకరు గుసగుసలాడుకోవటం మొదలుపెట్టారు. అంబత్తైయాన్పట్టి ప్రాంతానికి చెందిన రాజ్యక్కొడి నిజానికి ఎప్పుడో డాక్టర్ కావాల్సింది.
Also Read
- IMD Warning: ఎల్‌నినో వచ్చేసింది.. మాన్సూన్పై ఐఎండీ వార్నింగ్
- Sejal Pawar: డాక్టర్ అని చెప్పుకుంటూ చెత్త కూతలు కూసిన సెజల్ పవార్! అసలు రంగు బయటపెట్టిన కేఈఎమ్ హాస్పిటల్..
- Saayoni Ghosh: 17 ఏళ్లకే హీరోయిన్గా.. అనతికాలంలో ఎంపీగా.. ట్రెండింగ్‌గా మారిన సయానీ ఘోష్ కథేంటి?
- India summons US: అమెరికా దాడులపై భారత్ సీరియస్.. యూఎస్ దౌత్యవేత్తకు సమన్లు..
also read: Kodali Nani: ఇతర రాష్ట్రాలలో రోడ్లపై గోతుల్లేవా? లేవని నిరూపించగలవా పవన్?
1984లోనే పరీక్షలన్నీ పాసయ్యాడు. కానీ అప్పట్లో ప్రైవేట్‌లో ఎంబీబీఎస్ ఫీజు కట్టే స్తోమత లేక బీఎస్సీ(ఫిజిక్స్)లో చేరి మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. ఈ లోపు మరెన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. అయినా డాక్టర్ కావాలనే కోరిక ఆయనలో అప్పటి నుంచీ రగులుతూనే ఉండిపోయింది. వయసు పెరుగుతుండటంతో జీవితంలో ఇక డాక్టర్ని కాలేనేమో అని కూడా అనుకున్నాడు. కానీ ఒడిశాకి చెందిన ఓ వ్యక్తి 64 ఏళ్ల వయసులో గతేడాది మెడికల్ కాలేజీలో సీటు పొందాడని తెలుసుకొని ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. రోజుకు కనీసం మూడు గంటలు శ్రద్ధగా చదవాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగాడు.
రాజ్యక్కొడి చిన్న కొడుకు వాసుదేవన్ రెండో ప్రయత్నంలో ‘నీట్’లో విజయం సాధించాడు. 521 మార్కులతో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సంపాదించాడు. దీంతో కొడుకు స్టడీ మెటీరియల్‌నే తండ్రీ చదవటం ప్రారంభించాడు. ఏడాది ప్రిపేరయ్యాడు. మాక్ టెస్టులెన్నో రాశాడు. మొత్తానికి మొన్న ‘నీట్’కీ అటెండ్ అయ్యాడు. ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రశ్నలు ఈజీగా వచ్చాయని చెప్పాడు. 460 మార్కులు వస్తాయని అంచనా వేస్తున్నాడు. తనకు కూడా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వస్తే డాక్టర్ కావాలనే జీవిత కలను సాకారం చేసుకుంటానని అన్నాడు. రాజ్యక్కొడి పట్టుదలకు హ్యాట్సాఫ్ చెప్పొచ్చు.
తాజావార్తలు
-
IMD Warning: ఎల్‌నినో వచ్చేసింది.. మాన్సూన్పై ఐఎండీ వార్నింగ్
-
Sajjala Ramakrishna Reddy: రెండేళ్ల పాలనపై ప్రజల ఆగ్రహం బయటపడింది.. చంద్రబాబుకు ఇదే లాస్ట్ టర్మ్..!
-
Iran-US: ఇరాన్ మళ్లీ కొత్త మెలిక.. హార్ముజ్, యురేనియంపై కీలక వ్యాఖ్యలు
-
Sejal Pawar: డాక్టర్ అని చెప్పుకుంటూ చెత్త కూతలు కూసిన సెజల్ పవార్! అసలు రంగు బయటపెట్టిన కేఈఎమ్ హాస్పిటల్..
-
Clothes Drying Tips: వర్షాకాలంలో బట్టలు ఆరబెట్టడానికి కష్టపడుతున్నారా? ఈ సులభమైన చిట్కాలతో గంటల్లోనే డ్రై..!
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!