INS Mormugao: నౌకాదళంలోకి అత్యాధునిక వార్ షిప్ ఐఎన్ఎస్ మర్ముగోవా.. ప్రత్యేకతలివే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INS Mormugao, a P15B stealth-guided missile destroyer, commissioned into the Indian Navy: భారత నౌకాదళంలోకి కొత్తగా వార్ షిప్ ఐఎన్ఎస్ ‘మర్ముగోవా’ను ప్రవేశపెట్టారు. దీంతో భారత నౌకాదళం మరింతగా శక్తివంతం కానుంది. హిందూ మహాసముద్రంతో తన ప్రాబల్యాన్ని పెంచుకోవాలనుకుంటున్న చైనాకు అడ్డుకట్ట వేసేలా మర్ముగోవా ఉండబోతోంది. స్టెల్త్-గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌకను ఆదివారం భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సైన్యంలోకి ప్రవేశపెట్టారు. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రితో పాటు సీడీఎస్ అనిల్ చౌమాన్, నేవీ చీఫ్ అడ్మినరల్ ఆర్ హరికుమార్, గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై, గోవా సీఎం ప్రమోద్ సావంత్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Read Also: Xiaomi: షియోమీకి బిగ్ రిలీఫ్.. రూ.3700 కోట్లపై కోర్టు కీలక ఆదేశాలు..
Also Read
- Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
- India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
- Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్‌ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
ముంబైలోని నేవల్ డాక్ యార్డ్ లో పీ15బీ స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ మర్ముగోవాను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. స్వదేశీ నౌకానిర్మాణ చరిత్రలో మర్ముగోవాను మైలురాయిగా అభివర్ణించారు నావీ చీఫ్. ‘విశాఖపట్నం’ క్లాస్ డిస్ట్రాయర్ లో ఇది రెండో యుద్ధనౌక. నౌక 163 మీటర్ల పొడవు. 17 మీటర్ల వెడల్పుతో 7400 టన్నుల బరువుతో ఉంది. భారతదేశంలో నిర్మించిన అత్యంత శక్తివంతమైన యుద్దనౌకల్లో మర్ముగోవా ఒకటి. నాలుగు శక్తివంతమైన గ్యాస్ టర్బైన్లతో, కంబైన్డ్ గ్యాస్ అండ్ గ్యాస్ కాన్ఫిగరేషన్ లో 30 నాట్ ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు. దీనివల్ల శతృరాడార్లకు చిక్కకుండా స్టెల్త్ లక్షణాలను కలిగి ఉంది.
ప్రత్యేకతలు ఇవే..
మోర్మగో 75 శాతం స్వదేశీ సాంకేతికతతో నిర్మించారు. దీంట్లో సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్సైల్, సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్ వంటి సెన్సార్‌లు ఉన్నాయి. దీంట్లో యాంటీ సబ్ మెరైన్ వార్ ఫేర్ సామర్థ్యాల కోసం స్వదేశంలో అభివృద్ధి చేసిన రాకెట్ లాంచర్లు, టార్పెడోలు ఉన్నాయి. న్యూక్లియర్, బయోలాజకిల్-కెమికల్ యుద్ద పరిస్థితుల్లో పోరాడేలా నౌకను నిర్మించారు. ఆత్మనిర్భర్ భారత్ కు ఈ నౌక మరింత ఊతం ఇస్తుంది. ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫారమ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటెడ్ పవర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ , ఫోల్డబుల్ హ్యాంగర్ డోర్స్, హెలో ట్రావర్సింగ్ సిస్టమ్, క్లోజ్-ఇన్ వెపన్ సిస్టమ్, బో మౌంటెడ్ సోనార్ ఈ నౌకలో ఉన్నాయి.
తాజావార్తలు
-
POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు.. ఆర్మీ కాల్పుల్లో 30 మంది బలి..
-
Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Morning Habit: నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Peddi : పెద్ది రీ సెన్సార్.. కొన్ని సీన్స్ డిలీట్ చేసి.. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారు
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!