Site icon NTV Telugu

INS Mormugao: నౌకాదళంలోకి అత్యాధునిక వార్ షిప్ ఐఎన్ఎస్ మర్ముగోవా.. ప్రత్యేకతలివే..

Ins Mormugao

Ins Mormugao

INS Mormugao, a P15B stealth-guided missile destroyer, commissioned into the Indian Navy: భారత నౌకాదళంలోకి కొత్తగా వార్ షిప్ ఐఎన్ఎస్ ‘మర్ముగోవా’ను ప్రవేశపెట్టారు. దీంతో భారత నౌకాదళం మరింతగా శక్తివంతం కానుంది. హిందూ మహాసముద్రంతో తన ప్రాబల్యాన్ని పెంచుకోవాలనుకుంటున్న చైనాకు అడ్డుకట్ట వేసేలా మర్ముగోవా ఉండబోతోంది. స్టెల్త్-గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌకను ఆదివారం భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సైన్యంలోకి ప్రవేశపెట్టారు. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రితో పాటు సీడీఎస్ అనిల్ చౌమాన్, నేవీ చీఫ్ అడ్మినరల్ ఆర్ హరికుమార్, గోవా గవర్నర్‌ పీఎస్‌ శ్రీధరన్‌ పిళ్లై, గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Read Also: Xiaomi: షియోమీకి బిగ్ రిలీఫ్.. రూ.3700 కోట్లపై కోర్టు కీలక ఆదేశాలు..

ముంబైలోని నేవల్ డాక్ యార్డ్ లో పీ15బీ స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ మర్ముగోవాను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. స్వదేశీ నౌకానిర్మాణ చరిత్రలో మర్ముగోవాను మైలురాయిగా అభివర్ణించారు నావీ చీఫ్. ‘విశాఖపట్నం’ క్లాస్ డిస్ట్రాయర్ లో ఇది రెండో యుద్ధనౌక. నౌక 163 మీటర్ల పొడవు. 17 మీటర్ల వెడల్పుతో 7400 టన్నుల బరువుతో ఉంది. భారతదేశంలో నిర్మించిన అత్యంత శక్తివంతమైన యుద్దనౌకల్లో మర్ముగోవా ఒకటి. నాలుగు శక్తివంతమైన గ్యాస్ టర్బైన్లతో, కంబైన్డ్ గ్యాస్ అండ్ గ్యాస్ కాన్ఫిగరేషన్ లో 30 నాట్ ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు. దీనివల్ల శతృరాడార్లకు చిక్కకుండా స్టెల్త్ లక్షణాలను కలిగి ఉంది.

ప్రత్యేకతలు ఇవే..

మోర్మగో 75 శాతం స్వదేశీ సాంకేతికతతో నిర్మించారు. దీంట్లో సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్సైల్, సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్ వంటి సెన్సార్‌లు ఉన్నాయి. దీంట్లో యాంటీ సబ్ మెరైన్ వార్ ఫేర్ సామర్థ్యాల కోసం స్వదేశంలో అభివృద్ధి చేసిన రాకెట్ లాంచర్లు, టార్పెడోలు ఉన్నాయి. న్యూక్లియర్, బయోలాజకిల్-కెమికల్ యుద్ద పరిస్థితుల్లో పోరాడేలా నౌకను నిర్మించారు. ఆత్మనిర్భర్ భారత్ కు ఈ నౌక మరింత ఊతం ఇస్తుంది. ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫారమ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటెడ్ పవర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ , ఫోల్డబుల్ హ్యాంగర్ డోర్స్, హెలో ట్రావర్సింగ్ సిస్టమ్, క్లోజ్-ఇన్ వెపన్ సిస్టమ్, బో మౌంటెడ్ సోనార్ ఈ నౌకలో ఉన్నాయి.

Exit mobile version