NTV Telugu Site icon

Mumbai: ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర నౌకలో మంటలు.. ఒకరు గల్లంతు

Mumbaiship

Mumbaiship

ముంబై నేవల్ డాక్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మెయింటెనెన్స్‌లో ఉన్న ఇండియన్ నేవీ యుద్ధనౌకలో సోమవారం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నావికాదళానికి చెందిన జూనియర్ నావికుడు తప్పిపోయాడని, రెస్క్యూ టీమ్ అతని కోసం వెతుకుతోందని అధికారులు చెప్పారు. మిగతా సిబ్బంది అందరినీ లెక్కించినట్లు నావికాదళం తెలిపింది. మల్టీరోల్ ఫ్రిగేట్ ఐఎన్‌ఎస్ బ్రహ్మపుత్రలో ఆదివారం సాయంత్రం ముంబై నేవల్ డాక్‌యార్డ్‌లో రీఫిట్‌లో ఉండగా మంటలు చెలరేగాయని.. షిప్ ఓ వైపు పడి ఉందని నేవీ తెలిపింది.

ఇది కూడా చదవండి: AP Cyber Crime: రెట్టింపు డబ్బులంటూ మోసం.. మహిళ ఆత్మహత్య..

సోమవారం ఉదయం నేవల్ డాక్‌యార్డ్, ముంబై హార్బర్‌లోని ఇతర నౌకల సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోందని నౌకాదళం ఒక ప్రకటనలో తెలిపింది. ఓడను మాత్రం ప్లాట్‌గా తెచ్చేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదని వెల్లడించింది.

ఇది కూడా చదవండి: KCR: ఎల్లుండి అసెంబ్లీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..?

ఐఎన్‌‌ఎస్ బ్రహ్మపుత్ర స్వదేశీంగా నిర్మించింది. ‘బ్రహ్మపుత్ర’ క్లాస్ గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్‌లో మొదటిది. ఇది ఏప్రిల్ 2000లో భారత నౌకాదళంలోకి ప్రవేశించింది. ఈ నౌకలో 40 మంది అధికారులు, 330 మంది నావికులు, సిబ్బంది ఉన్నారు. జూనియర్ నావికుడు తప్ప అందరూ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. మిస్సింగ్ నావికుడి కోసం గాలింపు జరుగుతోందని.. అలాగే ప్రమాదంపై కూడా విచారణ జరుగుతుందని నౌకాదళం పేర్కొంది.

ఇది కూడా చదవండి: Tharun Sudhir Marriage : జైల్లో దర్శన్.. పెళ్ళికి రెడీ అయిన డైరెక్టర్-హీరోయిన్!

Show comments