Site icon NTV Telugu

Infiltration: బంగ్లాదేశ్‌ నుంచి భారీ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్ఎఫ్..

India Bangladesh

India Bangladesh

Infiltration: బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్న చొరబాటుదారుల ప్రయత్నాలను బీఎస్ఎఫ్ అడ్డుకుంది. అస్సాంలోని దక్షిణ సల్మారా మంకాచర్ జిల్లాలోని ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బంగ్లాదేశ్‌కి చెందిన బృందం చొరబాటు ప్రయత్నాలను బీఎస్ఎఫ్ విఫలం చేసింది. ఈ రోజు తెల్లవారుజామున అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వద్ద అనుమానిత కదలికలను గుర్తించడంతో సరిహద్దు దళాల ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాయి.

Read Also: Himanta Biswa Sarma: అస్సాంలో బాల్య వివాహాలను పూర్తిగా అంతం చేస్తాం..

బీఎస్ఎఫ్ తక్షణ చర్యలతో చొరబాటుదారులు వెనక్కి తగ్గారు. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఉన్న బంగ్లాదేశ్ జాతీయులు, రోహింగ్యాలను అధికారులు గుర్తించి, వారిని బంగ్లాదేశ్‌లోకి ‘‘నెట్టివేస్తున్నారు’’. గత కొన్ని రోజులుగా 150 మంది అనుమానిత అక్రమ బంగ్లాదేశ్ జాతీయులను అస్సాంలోని సరిహద్దు లోని వివిధ ప్రదేశాల ద్వారా బంగ్లాదేశ్‌లోకి నెట్టేశారు.

అయితే, భారత్ పుష్‌బ్యాక్ వ్యూహంపై బంగ్లాదేశ్ స్పందించింది. వెరిఫికేషన్ సమస్యను కేవలం పేరు ద్వారా మాత్రమే చేయలేమని, వ్యక్తి నేపథ్యం గురించి తనిఖీ చేయాలని బంగ్లాదేశ్ అధికారి రుహుల్ ఆలం సిద్ధిక్ అన్నారు. భారత్‌తో దీనిపై సామరస్యపూర్వకమై పరిష్కారాన్ని రూపొందించాలని కోరుకుంటున్నామని, బంగ్లాదేశీయులు కానీ వారిని మా దేశానికి పంపకుండా చూసుకుంటున్నామని అన్నారు. మరోవైపు, భారత్ ‘‘పుష్ బ్యాక్’’ విషయంలో అవసరమైతే జోక్యం చేసుకుంటామని బంగ్లాదేశ్ సైన్యం తెలిపింది.

Exit mobile version