Site icon NTV Telugu

IndiGo: ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..

Idigo Flight Emergency Landing

Idigo Flight Emergency Landing

IndiGo plane emergency landing at Kolkata airport after smoke warning: ఇటీవల కాలంలో దేశంలో పలు విమానాలు తరుచుగా ప్రమాదాలకు గురువుతున్నాయి. ఆకాశంలో ఉండగానే.. టెక్నికల్ సమస్యలు వస్తున్నాయి. తాజాగా మరోసారి ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి కోల్‌కతాకు బయలుదేరిన ఇండిగో విమానం కార్గో హెల్డ్ ప్రాంతంలో పొగలు వస్తున్నట్లుగా అలారం మోగడాన్ని పైలెట్లు గుర్తించారు. దీంతో ఈ సమాచారాన్ని కోల్‌కతా ఏటీసీకి అందించారు. ఎమర్జెన్సీ ల్యాంగింగ్ అనుమతి కోరారు పైలెట్లు.

Read Also: Godfather Teaser: సల్మాన్ ఖాన్‌తో కలిసి.. బద్దలు కొట్టిన మెగాస్టార్

కోల్‌కతా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఇండిగో ఫ్లైట్ 6ఈ-2513 ల్యాండింగ్ చేయడానికి అనుమతి ఇచ్చింది. ముందుజాగ్రత్తగా రన్ వేకు దగ్గర ఫైర్ ఇంజిన్లను మోహరించింది. పైలెట్లు స్టాండర్స్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్(ఎస్ఓపీ) అనుసరించి ఫ్లైట్ కోల్‌కతాలో ల్యాండ్ చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు. మేడే ప్రకటించి విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

అయితే కార్గో హెల్డ్ లో పొగలు వస్తున్నట్లుగా తప్పుగా మోగిందని.. ఇది నకిలీ హెచ్చరికగా డీజీసీఏ అధికారులు వెల్లడించారు. కోల్‌కతాలో ల్యాండింగ్ కు ముందు కార్గోలో పొగ వస్తున్నట్లు అలారం తప్పుగా మోగింది. అయితే పైలెట్లు స్మోక్ అలెర్ట్ ను గుర్తించి ఫ్లైట్ ను వెంటనే ల్యాండింగ్ చేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Exit mobile version