Site icon NTV Telugu

IndiGo: ఢిల్లీలో గాలి బీభత్సం.. ఇండిగో విమానానికి కుదుపులు.. ప్రయాణికులు కేకలు

Indigo

Indigo

దేశ రాజధాని ఢిల్లీలో దుమ్ము తుఫాన్ సృష్టించిన బీభత్సానికి ఇండిగో విమానం అల్లకల్లోలానికి గురైంది. దీంతో ప్రయాణికులంతా బెంబేలెత్తిపోయారు. ప్రాణ భయంతో కేకలు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Vikram Sugumaran : ప్రముక తమిళ దర్శకుడు కన్నుమూత..

ఆదివారం  ఢిల్లీలో మరోసారి దుమ్ము తుఫాన్ బీభత్సం సృష్టించింది. అయితే అదే సమయంలో 6E 6313కి చెందిన ఇండిగో విమానం రాయ్‌పూర్ నుంచి ఢిల్లీకి వస్తోంది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావాలి. ఇంతలోనే పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీచాయి. 80 కి.మీ వేగంతో గాలులు వీచాయి. దీంతో విమానం ల్యాండ్ అయ్యేందుకు కుదరలేదు. దీంతో మళ్లీ విమానాన్ని పైకి లేపాడు. ఇక గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఇక విమానం కుదుపులకు గురి కావడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా భయాందోళనకు గురై కేకలు వేశారు. చివరికి విమానం సాయంత్రం 5.05 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉండగా ఎట్టకేలకు సాయంత్రం 5.43 గంటలకు ల్యాండ్ అయింది. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి: Israel-Gaza: గాజా సహాయ కేంద్రం దగ్గర కాల్పులు.. 31 మంది మృతి

గత కొద్ది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో దుమ్ము తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. వాతావరణ మార్పులతో ఢిల్లీ పరిసర ప్రాంతాలు అల్లకల్లోలంగా ఉంటోంది. దీంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఆదివారం కూడా నగరంలో భారీ ఈదురుగాలులతో పాటు వర్షం కురిసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇక సోమవారం కూడా వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

 

Exit mobile version